ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవితం జీతంతో లింకై ఉంటుంది. ఏ వ్యాపార వ్యాపకాలు లేనప్పుడు జీతం రాకపోతే జీవనాధారం జరిగిపోతే ఆ వేదన వర్ణనాతీతం. సెప్టెంబర్ నెల జీతం రాకపోవటం సమ్మె ఉదృతం కావటం తో ఆర్టీసీ ఉద్యోగుల్లో నిరాశానిస్పృహలు ఆవహిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణా ఏర్పాటు కావటానికి ప్రభుత్వోద్యోగులు ప్రత్యేకించి ఆర్టీసి ఉపాధ్యాయ వర్గాల పాత్ర ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు తెలంగాణాలో: 


"టిఎస్-ఆర్టీసీ కార్మికుల విషాదాలు కొనసాగుతున్నాయి! ఉద్యోగం ఊడిపోయినట్లే, సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారంటూ ప్రభుత్వం చేసిన అధికారిక ప్రకటనతో కార్మికులలో తీవ్ర ఆందోళనకు చెలరేగింది. ఈ కారణంతో శనివారం ఆత్మాహుతి యత్నం చేసిన టిఎస్-ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌ రెడ్డి ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు కూడా ముగియక ముందే మరో కార్మికుడు రాణిగంజ్‌ డిపోకు చెందిన కండక్టర్‌ సురేందర్‌ గౌడ్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సెప్టెంబరు నెల జీతం రాకపోవడం, బిడ్డ పెళ్లికి తీసుకున్న ఋణానికి ఈనెల చెల్లించాల్సిన ఈఎంఐ బౌన్స్‌ కావడమే ఇందుకు కారణం!" అని చెపుతున్నారు.

Image result for TSRTC Driver <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SRINIVAS' target='_blank' title='srinivas - గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>srinivas </a>Reddy & conductor Surender goud

Image result for TSRTC Driver <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SRINIVAS' target='_blank' title='srinivas - గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>srinivas </a>Reddy & conductor Surender goud
పై రెండు ఆత్మహత్యల దరిమిలా తెలంగాణా ఉద్యమ సమన్వయకర్త ప్రొ. కోదండరాం మాట్లాడుతూ  "ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్య. టిఎస్-ఆర్టీసీ కార్మికులు కేవలం వేతనాల కోసమే సమ్మె చేస్తున్నారంటూ ప్రభుత్వం పేర్కొనడం భావ్యం కాదు. గతి లేని పరిస్థితుల్లో మాత్రమే టిఎస్-ఆర్టీసీని కాపాడు కోవడానికే కార్మికులు సమ్మెకు దిగారు" అని వ్యాఖ్యానించారు. "రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసత్య ప్రచారాలకు దిగుతున్నారు" అని ప్రొ. కోదండరాం విమర్శించారు.
Image result for pro. kodandaram & Vijayashanti
కాగా, ఖమ్మంలో నిన్న "ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస తీసుకున్నారు. 90 శాతం కాలిన గాయాలతో, ఆయనను ఖమ్మం నుంచి హుటాహుటిన హైదరాబాద్‌ లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. శ్రీనివాసరెడ్డి మృతితో ఉద్యమం మరింత ఉద్రికతగా మారింది.


ఈ సందర్భంగా ప్రాణ త్యాగాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం కేసీఆర్‌ దొరకు వెన్నతో పెట్టిన విద్యఅని, వాటిని చూసి చలించేతత్వం ఈ దొరగారికి ఎన్నడూ లేదనే విషయం పలు సందర్భాల్లో ఋజువైంది" అని ఎద్దేవా చేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌-పర్సన్ విజయశాంతి. గతంలో కేసీఆర్ తన సోదరి అంటూ అతి దగ్గరగా పనిచేసిన అనుభవం విజయశాంతికి ఉంది. 
Image result for pro. kodandaram & Vijayashanti
కేసీఆర్ సహజ గుణాన్ని - ఉదహరిస్తూ  "తెలంగాణ సాధన కోసం బలిదానం చేసిన శ్రీకాంతా చారి త్యాగాన్ని గుర్తించకుండా, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. టిఎస్-ఆర్టీసీ కార్మికుల కోసం శ్రీకాంతా చారి తరహాలో బలిదానం చేసుకుంటే కేసీఆర్ దిగివస్తారని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి భావించడం దురదృష్టకరం. కేసీఆర్ కి అంత పెద్ద మనసు లేదు"  కేసీఆర్ సహజ గుణం నియంతృత్వం  అని ,  దోర మనస్సు తెలిసిన విజయశాంతి  బలంగా చెప్పటం జనంలో ఆలోచనలకు ఆజ్యంపోసింది.  ప్రాణత్యాగం చేసి, ముఖ్యమంత్రి మనసు మార్చే ప్రయత్నం చేయడం కంటే, బతికి పోరాడి సాధించాలనే ఆలోచనతో ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమిస్తే, దొరవారి నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడవచ్చని అన్నారు విజయశాంతి.

మరింత సమాచారం తెలుసుకోండి: