ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి దంపతులు భేటీ అయ్యారు. సీఎం జగన్, జగన్ భార్య భారతి చిరంజీవి దంపతులను ఆహ్వానించారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ఏ విషయాల గురించి జగన్ చిరంజీవి చర్చిస్తారనే విషయం గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ వర్గాల్లో ఈ భేటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. చిరంజీవి జగన్ ఇంటికి చేరుకోగానే షాలువా కప్పి సత్కరించారు. 
 
గంట సమయం పాటు ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది. కొంతసేపటి క్రితం భేటీ ముగిసిన తరువాత చిరంజీవి తిరుగు ప్రయాణమైనట్లు తెలుస్తోంది. చిరంజీవి నటించి అక్టోబర్ 2వ తేదీన విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమా గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. లంచ్ చేసే సమయంలో సైరా సినిమా గురించి సీఎం జగన్ కు తెలియని విషయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో సీఎం జగన్ ఈ సినిమాను వీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
సినిమా చూడటం కొరకు జగన్ వైపు నుండి అంగీకారం వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు చిరంజీవి సీఎం జగన్ ను వినోదపు పన్ను మినహాయింపు గురించి కూడా కోరినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ వినోదపు పన్ను విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. విజయవాడలో పీవీపీ మాల్ లో జగన్ సినిమా చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
చిరంజీవి వైసీపీలో చేరబోతున్నారా అనే ఊహాగానాలకు రాజకీయ పరమైన చర్చలు జరగలేదని సినిమాకు సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడినట్లు తెలుస్తోంది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి కి చిరంజీవి అభినందనలు చెప్పినట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేపథ్యం, జీవిత విశేషాల గురించి కూడా సీఎం జగన్ తో చిరంజీవి చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: