తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు ఓయూ జేఏసీ నేతలు మద్దతు పలికిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల ఆర్టీసి కార్మికులతో కలిసి నిరసనల్లో పాల్గొంటూ వారికి తమ సంఘీభావం తెలుపుతూ ఓయూ జేఏసి నేతలు.. తాజాగా మంగళవారం నాడు జలదీక్ష కూడా చేపట్టారు. సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందని జఏసి నేతలు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.

ఆర్టీసీని ప్రభుత్వంలో  విలీనం చేయడంతోపాటు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జఏసి నేతలు. ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా క్యాంపస్‌లో నిరసన చేపట్టిన పలువురు ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఆ  తర్వాత విడుదల కూడా చేశారు.


 తెలంగాణ ఆర్టీసీ సిబ్బందికి నిలిపేసిన సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించేలా ఆదేశాలు కూడా  జారీచేయాలని కోరుకుంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో  విచారణ కూడా  జరిగింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 49 వేల 190 మందికి ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెలకుగాను అందాల్సిన జీతం ఇంకా చెల్లించలేదనే  సంగతి  అందరికి తెలిసిందే. ఇప్పటికే ఎంతో ఆలస్యమైనందున తక్షణమే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్‌ కోర్టుకు విజ్ఞప్తి చేయడం జరిగింది. 


అక్టోబర్ నెల ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు జీతాలు రాకపోవడంతో ఆర్టీసి సిబ్బందికి చెందిన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో కష్టాలు పడవలసి వస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  ఇదే విషయమై కోర్టు ఆర్టీసి యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. సమ్మె నేపథ్యంలో సిబ్బంది లేకపోవడం వల్లే వారికి జీతాలు ఇవ్వలేదు అని కోర్టుకు విన్నవించింది..సోమవారం వరకు కార్మికులకు జీతాలు చెల్లిస్తామని ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టుకు తెలియచేసింది


మరింత సమాచారం తెలుసుకోండి: