కాలం మారింది.. కాలంతో పాటుగా యువతీ యువకుల ఆలోచనలు కూడా మారుతున్నాయి.  వారి ఆలోచనలకు తగినట్టుగా వారి యాటిట్యూడ్, ప్రవర్తన, అనుసరించే తీరు ఉంటుంది.  ఎవరు ఎలా ప్రవర్తిస్తారో .. ఏం చేస్తారో ఎవరికీ తెలియదు.  ఇక ప్రేమ అనే రెండు అక్షరాలు పుట్టడానికి సమయం అవసరం లేదు.  సందర్భం అవసరం లేదు.. వయసుతో అంతకంటే అవసరం లేదు.  ఎక్కడైనా పుట్టొచ్చు.. ఎలాగైనా పుట్టొచ్చు.. ఎప్పుడైనా పుట్టొచ్చు.  


నిజమైన ప్రేమ అయితే కలకాలం ఉంటుంది.  అలా కాకుండా.. ఏదో తాత్కాలికంగా పుటిన ప్రేమ అయితే.. గాలిలోనే కలిసిపోతుంది. అలాంటి ప్రేమలు మబ్బులు కమ్మిన ఆకాశం లాంటివి అలా వచ్చి ఇలా వెళ్లిపోతాయి.  కొంతమంది ప్రేమిస్తున్నామని అమ్మాయి వెంట పడతారు. ఇష్టం లేదని ఎంత చెప్పినా వినరు.  చివరికి ఆ అమ్మాయిలు విసుగుపుట్టి పోలీసులకు కంప్లైట్ చేస్తుంటారు.  పోలీసులు ఆ యువకుడిని పిలిచి నాలుగు ఉతికితే చెప్పాల్సింది అంతా చెప్పేస్తాడు.  


అలాంటి పోలీసునే లవ్ చేస్తున్నానని వెంటపడితే.. ఇనేమన్నా ఉన్నదా చెప్పండి.. గూబ గుయ్ మని వాసిపోదు. అలాంటి తింగర పని ఒకటి ఓ వ్యక్తి చేశాడు.  ఓ పోలీస్ కానిస్టేబుల్ దారిలో కనిపిస్తే.. ఐ లవ్ యు అని చెప్పాడు.  అంతే... మొదట ఆమె షాక్ అయ్యింది.  ఏంటి అని గట్టిగా అడిగితె.. మరలా ఐ లవ్ యూ అని చెప్పాడు.  అంటే ఆమెకు కోపం నషాలానికి ఎక్కడినుండి.  


మేడం మూడు నెలలుగా ట్రై చేస్తున్నా.. ప్రేమిస్తున్నా మేడం ఒప్పుకొండి ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డాడు.  దీంతో ఆ కానిస్టేబుల్ కు నిజంగానే కోపం వచ్చేసింది.  తిట్టేసింది.  కలర్ పట్టుకుంది.  ఈరోలోగా అటుగా వెళ్ళేవాళ్ళు ఆగి వాళ్ళను చూస్తున్నాడు.  ఆ యువకుడు మాత్రం అదే చెప్తున్నాడు.. మేడం ఒప్పుకొండి మేడం.. అంటే ఆ పోలీస్ కానిస్టేబుల్.. మీ అమ్మానాన్నల ఫోన్ నెంబర్ ఇవ్వు మాట్లాడతా అన్నది.  వాళ్లకు చెప్పి వచ్చా మేడం.. మీ కోడలు దొరికింది అని చెప్పడం మొదలు పెట్టాడు.  పాపం కాసేపు ఆ కానిస్టేబుల్ కు ఏం చెప్పాలో అర్ధంకాలేదు.  కాసేపటి తరువాత ఆ యువకుడు అది ప్రాంక్ అని.. యూట్యూబ్ కోసం చేస్తున్నట్టు చెప్పడంతో శాంతించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: