దేశ చరిత్రలోనే తొలిసారి ఏపీ ప్రభుత్వం జ్యుడిషియల్ ప్రివ్యూకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.దేశంలోనే మొదటిసారిగా ఈ జ్యూడిషియల్ ప్రివ్యూ ప్రాసెస్ ని అనుసరించబోతున్న జగన్ ప్రభుత్వం అవినీతి జరగకుండా అడ్డుకట్టవేసేందుకే ఈ నిర్ణయం.ఇప్పటికే జ్యుడిషియ‌ల్ ప్రివ్యూ ప్రొసెస్ చేసేందుకు హైకోర్టు న్యాయమూర్తి జ‌స్టిస్ బి శివ‌శంక‌ర్ రావును నియమించగా.. రూ.100 కోట్లు పైగా ప‌నుల టెండ‌ర్లను జ్యుడిషియ‌ల్ ప్రివ్యూ ప్రాసెస్ (న్యాయ సమీక్ష) చేస్తారు.

అయితే తాజాగా ప్రివ్యూకు తొలి టెండర్ రాబోతోంది.రాష్ట్ర ప్రభుత్వం 108, 104 ఒక్కో అంబులెన్స్ నిర్వాహణకు నెలకు సుమారు రూ. 1.35 లక్షలు అవుతుందని అంచనా వేస్తోంది రాష్ట్రంలో 108, 104 వైద్య సేవల కోసం ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించనుంది.. వీటిని ప్రివ్యూకు పంపాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.జగన్ నిర్ణయించిన దాని ప్రకారం మరొక 700 కి పైగా అంబులెన్సులను సిద్ధం చేయలని నిశ్చయించుకున్నారు. పబ్లిక్ డొమైన్ లో ఈ టెండర్ కి సంబందించిన వివరాలను పొందు పరుస్తారు.

జ్యుడిషియల్ ప్రివ్యూకు సంబంధించి గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లోనే చ‌ట్టం చేశారు. ప్రివ్యూకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేతులు వెబ్‌సై‌ట్‌ను ప్రారంభించారు. ఈ ప్రివ్యూ ప్రాసెస్ ప్రకారం ఇకపై ఏదైనా టెండర్ రూ.100 కోట్లు దాటితే.. జడ్జి టెండర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రజలు, నిపుణుల పరిశీలనకు వారం రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచుతారు. ప్రజలు, నిపుణల సలహాలను జ్యూడిషియల్ ప్రివ్యూ పరిశీలించడం జరుగుతుంది.ఈ ప్రక్రియ పూర్తవడానికి 15 రోజుల సమయం పడుతుంది.అంబులెన్స్‌ల నిర్వాహణ అంచనా వ్యయం రూ. 100 కోట్లు దాటడంతో.. జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. ఈ మేరకు వివరాలను తెలపాలని జ్యుడిషియల్ ప్రివ్యూ వైద్య ఆరోగ్యశాఖను కోరింది.                                                                


మరింత సమాచారం తెలుసుకోండి: