ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం గురించి తెలియని వ్యక్తి వుండరు.ముఖ్యంగా యూత్  మొత్తం ఫుల్ గ ఫాలో ఆయే ప్రోగ్రాం అది.సోనీ ఛానల్‌లో ప్రసరామవుతున్న ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఐడల్ 11’ రియాల్టీ షోలో జడ్జికి ఊహించని అనుభవం ఎదురైంది. ఈ షోలో పాట పాడడానికి వచ్చిన ఓ కంటెస్టెంట్.. మహిళా జడ్జికి ముద్దుపెట్టాడు.ఊహించని ఘటనతో సదరు మహిళా జడ్జి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.దీంతో అక్కడున్నవారందరు షాకయ్యారు. ఇండియన్ ఐడల్ 11 షోలో ప్రముఖ గాయకులు అను మాలిక్, విశాల్ దడ్లానిలతో పాటు నేహ కక్కర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.


అయితే దీనిని సోనీ టీవీ ప్రోమో రూపంలో రిలీజ్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... ఈ షోలో పాడడానికి వచ్చిన ఓ 31 ఏళ్ళ గాయకుడు పాటపాడిన తరువాత తనను గుర్తుపట్టాల్సిందిగా జడ్జి నేహాను కోరాడు. దాంతో ఆమె స్టేజీ పైకి వెళ్లింది.దీంతో స్టేజీ మీదకు వెళ్లిన నేహా అతను ఇచ్చిన బహుమతులను తీసుకొని కృతజ్ఞతగా అతన్ని హగ్‌ చేసుకుంది. ఒక్కసారిగా అతడు బలవంతంగా ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. దీంతో మాలిక్, విశాల్ దడ్లాని, యాంకర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. యాంకర్ ఆదిత్య నారాయణ్ ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించారు. దీనికి సంబంధించిన వీడియోను సోనీ టీవీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు కంటెస్టెంట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.                                                                                                                                                                                

మరింత సమాచారం తెలుసుకోండి: