ఈ మధ్య కాలంలో పండుగ సమయంలో కొనుగోళ్లు పెంచుకునేందుకు కంపెనీలు వివిధ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో కూడా పండుగ సమయంలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పెంచుకోవాలనే ఆశతో ఒక సరికొత్త ఆఫర్ ప్రకటించింది. వినియోగదారులను ఆకట్టుకునేలా వివో సంస్థ కేవలం 101 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే వివో ఫోన్ ను సొంతం చేసుకొనేలా ఆఫర్ ప్రకటించింది 
 
కానీ ఈ ఆఫర్ వివో ఫోన్ ఆన్ లైన్ లో కొనుగోలు చేయాలనుకునేవారికి వర్తించదు. కేవలం ఆఫ్ లైన్ లో కొనుగోలు చేయాలనుకునేవారికి మాత్రమే వర్తిస్తుంది. 18వ తేదీన మొదలైన ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు వర్తిస్తుందని తెలుస్తోంది. వివో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునేవారికి మరికొన్ని ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి హెచ్ డీ బీ ఫైనాన్స్ తో ఎవరైనా వివో ఫోన్లను కొనుగోలు చేస్తే వారు 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. 
 
ఐసీఐసీఐ, హెచ్ డీ ఎఫ్ సీ క్రెడిట్ కార్డులు ఉపయోగించి కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.నెలకు కేవలం 926 రూపాయల ఈఎంఐతో వివో ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఎవరైనా పాత ఫోన్లను ఇచ్చి కొత్త వివో ఎస్1, వివో వి17 ప్రొ ఫోన్ కొనుగోలు చేస్తే 1,999 రూపాయల బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ను పొందవచ్చని తెలుస్తోంది. వివో మిగతా మోడళ్లపై కూడా ఆకట్టుకునే ఆఫర్లను ప్రకటించింది. 
 
వివో వై12, వివో వై15, వివో వై17, వివో ఎస్1, వివో వి15, వివో జడ్1ఎక్స్, వివో వి15ప్రొ, వివో వి17ప్రొ పై కూడా వివో సంస్థ ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఆఫర్లతో వివో ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: