కరీంనగర్‌ జిల్లా  హుజూరాబాద్‌ మండలంలో రెండు రోజుల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. హుజూరాబాద్‌ మండలంలోని   కందుగుల గ్రామానికి చెందిన  నేదురు చంద్రమౌళికి మూడున్నర ఎకరాల భూమి ఉంది. అందులో వరి పంట సాగు వేయడం జరిగింది.  చంద్రమౌళి ఇప్పటి వరుకు  సుమారుగా ఎకరాకు రూ.25 వేల చొప్పున ఖర్చు చేయడం జరిగింది. ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌లో ఆఖరికి సమయం కావడంతో తీవ్ర కష్టాలతో సాగు చేశాడు. మరో రెండు రోజుల్లో వరి కోసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఇక  శుక్ర, శనివారం కురిసిన వర్షంతో వరి మొత్తం నేలపాలు అయంది.


వరి కోసేందుకు వీలు లేకుండా  పొలం అంతా నీటితో నిండిపోయింది. ఈ  పరిస్థితి ఒక్క చంద్రమౌళిదే కాదు జిల్లాలోని రైతులందరూ వర్షాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మూడు రోజులుగా  జిల్లా వ్యాప్తంగా కురిసిన వార్షాలకు  అన్నదాతకు గుండె కోతను  మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బ తినడం జరిగింది. పంట చేతి కొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపానికి అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ఆరు నెలలు శ్రమించి సాగుచేసి పంట చేతి కొచ్చే సమయంలో నేలపాలు కావడంతో దిక్కుతోచని  స్థితిలో పడ్డారు రైతులు. 


ఇక ఖరీఫ్‌ సీజన్‌ మొదటిలో వర్షాలు కురువక పంటల సాగు ఆలస్యం కావడం జరిగింది. ఇక సీజన్‌ చివరి దశలో కురుస్తున్న అకాల వర్షాలతో చెరువులు, కుంటలు అన్ని నిండి జలకళను సంతరించకున్నాయి. ఈ నెలలో తొమ్మిది రోజుల్లో రికార్డుస్ధాయిలో అత్యధిక  వర్షపాతం నమోదు అయినట్లు తెలుపుతున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని రామడుగు, శంకరపట్నం, మానకొండూరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు అవ్వగా మిగిలిన 13 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదు కావడం గమనించ వలసిన విషయం.

ఇటీవల కురిసిన వర్షానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు మొత్తం నీట మూగడం రైతులకు గుండె కోతను  మిగిల్చింది. ప్రధానంగా శంకరపట్నం, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వరిపంటలు  చాల ఎక్కువగా శాతం నష్టం ఏర్పడింది రైతులకు. సైదాపూర్‌ మండలంలో కూడా అత్యధికంగా 103.2మి.మీ, జమ్మికుంటలో 80.2, వీణవంకలో 70.2, చిగురుమామిడిలో 65.6మి.మీటర్ల వర్షపాతం నమోదు  అయంది. మొత్తానికి  జిల్లావ్యాప్తంగా 45.5 మిమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: