ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రుల అపాయింట్‌మెంట్ దొరకలేదంటూ తాజాగా జరిగిన ప్రచారంపై జనసేన అధినేత  అయిన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఎట్టకేలకు  వైఎస్ జగన్  అమిత్ షాను కలిసినప్పటికీ,ఇతరులతో  అపాయింట్‌మెంట్ దొరకకపోవడంతో ఆయన  తిరిగి వచ్చారనే  వార్తలు వింటుంటే.. చాలా బాధ  పడ్డాను అన్నారు పవన్ కళ్యాణ్.

ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మన మీద కేసులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి  మనకి ధైర్యం సరిపోదు. నాపై  కేసులు ఉండి ఉంటే.. నేను వెళ్లి పైస్థాయి వ్యక్తులతో  అంత గెట్టిగా మాట్లాడలేను. కేసులు ఉన్న వ్యక్తులు సీఎం అయితే, రాష్ట్రానికి  ఎం న్యాయం జరుగుతుందనేది ప్రశ్నర్ధకంగా మారింది ,అని పవన్ కళ్యాణ్ అన్నారు.

వైఎస్ వివేకా హత్య కేసు, విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి దాడి మీద  ఇదివరకు సీబీఐ విచారణలు జరపాలంటూ గతంలో రచ్చ చేసిన  వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు సీఎం కాగానే ఎందుకు మౌనంగా ఉన్నారని పవన్ ప్రశ్నించారు.సీఎం కాగానే బాబాయ్ హత్యను మర్చిపోయారా ? కోడికత్తిని మర్చిపోయారా ? అని  ఎద్దేవా చేస్తూ,సీఎం జగన్‌ను పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జగన్ నేరాలను ప్రోత్సహిస్తున్నందు వలెనే  వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో వెళ్తున్నారని  పవన్ ఆరోపించారు. అసలు అసెంబ్లీకి వెళితే.. ఆ 150 మంది కలసి 20 మందిని కొడతారేమో అనేంతగా భయపెడుతున్నారని పవన్ కళ్యాణ్ చాలా మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు తెలుగు దేశం పార్టీ వారు  ఇసుక మాఫియా చేస్తే, ఇప్పుడు వైసీపీ చేస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఏపీలో ఇసుక కరువయింది అని తెలంగాణ, బెంగళూరుకు తరలి వెళ్తోందన్నారు ఆయన. భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబర్ 3న చెప్పటబోతున్న  ఛలో విశాఖ కార్యక్రమాన్ని జనసేన పార్టీ  చేపట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: