అమ్మయ్య కష్టమైనప్పటికే గోదావరిలో మునిగిపోయి కొట్టుకుపోయిన బోటును  బయటకు తీయడంలో సీఎం జగన్మోహరెడ్డి ప్రభుత్వం సఫలమైంది. దాదాపుగా 38 రోజుల తర్వాత పర్యాటకుల బొట్టు బాటపడడంతో అధికారయంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద టూరిజం బోట్  సెప్టెంబర్ 15వ తేదీన గోదావరిలో మునిగిపోయింది.  ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందగా, 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా 12 మంది ఆచూకీ లభించలేదు.  దీనితో బొట్టును బయటకు తీసే విషయాన్నీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో కొంతమంది నిపుణులు బోటును బయటకు తీయడం సష్టసాధ్యమని తేల్చి చెప్పాయి.



నిపుణులు సైతం మునిగిపోయిన బోటును బయటకు తీయడం సాధ్యం కాదని స్పష్టం చేసినప్పటికీ కూడా  పట్టువిడవకుండా శతవిధాలా ప్రయత్నించారు. చివరికి ఈ ప్రయత్నంలో ధర్మాడి సత్యం బృందం పూర్తీ స్థాయిలో సఫలీకృతమైంది. కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటును వెలికితీశారు. ఈ ఆపరేషన్‌‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధర్మాడి సత్యం బృందం విజయవంతంగా పూర్తీ చేసింది. మొత్తానికి బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో బోటును బయటకు తీశామని ధార్మడి సత్యం అన్నారు.. అయితే వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. 




దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బోటు బయటకు తీస్తుండగా అందులో నుంచి దుర్వాసన వస్తోంది. బోటులో ఉన్న మృతదేహాలు కుళ్లిపోవడం వల్లే దుర్వాసన వస్తోందని అధికారులు చెబుతున్నారు, ఇంకొద్దిసేపట్లో బోటును ధర్మాడి సత్యం ఒడ్డుకు తీసుకురానున్నారు. అయితే వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రోప్‌ల సాయంతోనే  బోటు బయటకు తీయడంలో తన బృందంతో పాటు అధికారుల కష్టం కూడా ఉందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: