రాజధానిపై ఏపీ ప్రభుత్వానికి పీటర్ కమిటీ నివేదిక సమర్పించింది. రాజధాని కోసం చంద్రబాబు నాయుడు కేవలం రూ.5వేల కోట్లే ఖర్చు చేశారని వెల్లడించిన కమిటీ.. అమరావతిలో ప్రతి ప్రాజెక్టు, నిర్మాణాన్ని సమీక్షించాలని నిర్ణయించింది. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు నిబంధనలకు విరుద్దంగా ఉండటమే కాకుండా  అమరావతి నిర్మాణంలో రూ.30వేల కోట్ల మేర దుబారా ఖర్చు జరిగిందని పీటర్ కమిటీ తెలిపింది.  


ఐదేళ్లలో రూ. లక్షా 65వేల కోట్ల అప్పులు చేశారని వివరించింది. పీటర్ నివేదికను మీడియాకు వివరించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు.  రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని నిప్పులు చెరిగారు.ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష... రాజధాని. ఐదేళ్లయినా కానీ రాజధానిలో చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదు.  చంద్రబాబు రాష్ట్ర హయాంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం అయ్యుంది. కానీ మా ప్రభుత్వం హయాంలో రాజధాని నిర్మాణం పూర్తిచేస్తాం. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా రాజధానిని నిర్మిస్తాం. 


రాజధాని ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినది కాదని.. 13 జిల్లాలు అభివృద్ధి చేస్తాం అన్నారు. నిపుణుల కమిటీ రాష్ట్రం మొత్తం పర్యటించి రాజధానిని, అభివృద్ధిని నిర్ణయిస్తారని మంత్రి బొత్స అన్నారు.రాజధానిపై ప్రభుత్వానికి, ప్రజలకు ఓ స్పష్టత ఉంది.. కానీ చంద్రబాబు, లోకేష్‌కు మాత్రం లేదన్నారు. అరచేతిలో వైకుంఠం చూపెట్టినట్టు రాజధాని కోసం గ్రాఫిక్స్ తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు బొత్స.  తన వియ్యంకుడికి రాజధాని పక్కన 5వేల ఎకరాలను ఇచ్చారని ఆరోపించారు. 


 అంతేకాదు చంద్రబాబు తన అనుచరులకు రాజధాని భూములను కట్టబెట్టారని ఆరోపించారు.రాజధానిలో ఏం అభివృద్ధి చేశారని చంద్రబాబుకు పేరొస్తుందో చెప్పాలన్నారు మంత్రి. ఐతే రాజధానిపై పీటర్ కమిటి నివేదిక, మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఇప్పడు ఏపీలో హాట్‌టాపిక్‌గా మారాయి. మరి దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: