2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం.  ఆ వేడుక కోసం తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రధాని మోడీ, ఇంకా అనేకమంది నేతలు అమరావతికి తరలివచ్చారు.  అమరావతికి వచ్చి అక్కడి పరిస్థితులు చూసి, అమరావతి కోసం తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.  ఇక అమరావతి కోసం బాబు వేసిన ప్లాన్ అన్నీఇన్నీ కాదు.  


డిజైన్స్ ఓకే చేయడానికి మూడేళ్లు పట్టింది.  మూడేళ్ళలో అమరావతిని మొదటి దశ నిర్మాణాలు పూర్తిచేస్తారని చెప్పారు. కానీ, మొదటిదశ నిర్మాణాలు కాదు.. తాత్కాలిక నిర్మాణాలు తప్పించి శాశ్వత నిర్మాణాలు ఏవి సిద్ధం కాలేదు.  కోట్లాది రూపాయల ధనం ఖర్చు అయ్యింది. దీంతో ప్రజలు ఆగ్రహించారు.  2019 ఎన్నికల్లో బాబు ఓడిపోయారు.  వైకాపా అధికారంలోకి వచ్చింది.  ఇప్పుడు అమరావతిలో రాజధాని ఉంటుందా ఉండదా.. ?


రాజధానిని అమరావతి నుంచి ఎక్కడికి మారుస్తున్నారు..? దీనిపై వేసిన కమిటీ ఏం చెప్పబోతున్నది?


ఆంధ్రప్రదేశ్ కు నడిమధ్యన అమరావతి ఉన్నది.  అక్కడైతే రాజధాని బాగుంటుందని చెప్పి రాజధానిని అక్కడ నిర్ణయించారు.  దీనికోసం ప్రజల దగ్గరి నుంచి 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది.   ఐదేళ్ళలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి నిర్మిస్తామని చెప్పారు.  ఎంతమేరకు నిర్మాణం జరిగింది అన్నది దేవుడికే తెలియాలి.  నిర్మాణం పనులు ఎంతవరకు వచ్చాయి అంటే తెలియదు.  ఇప్పుడు అమరావతిలో నిర్మాణం జరగడం లేదు.  


రాజధాని విషయంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత నిపుణుల కమిటీ వేసింది.  ఈ నిపుణుల కమిటీ ఏం చెప్పబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  నిపుణల కమిటీ రాజధానిని ఎక్కడ నిర్మించమంటే అక్కడే అని బొత్స హిట్ ఇచ్చారు.  దీనిని బట్టి చూస్తుంటే.. రాజధానిని నిర్మాణం అమరావతి నుంచి కదిలివెళ్లేలానే కనిపిస్తోంది.  ప్రజలు, ప్రభుత్వానికి క్లారిటీ ఉందని, చంద్రబాబుకే క్లారిటీ లేదని బొత్స అంటున్నాడు.  రాజధాని ఎక్కడో చెప్పి త్వరగా అందరికి ఓ క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుంది కదా మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: