రాజస్థాన్ పోలీసులకు ఇప్పుడు కొత్త తలనొప్పులు రాబోతున్నాయి.  ఆర్మీలో పనిచేసే వ్యక్తులు ఎప్పుడు ఫిట్ గా ఉంటారు.  వాళ్లకు పొట్టలు రావడం అన్నది జరగదు.  ఎందుకంటే వాళ్ళు నిత్యం పహారా కాస్తుంటారు. చలిలో బోర్డర్లో కాపలా కాస్తుంటారు.  అందుకే ఫిట్ గా ఉంటారు.  శత్రువులకు గాలింపు చర్యలు చేపట్టాలి.  బరువులు మోసుకుంటూ వెళ్ళాలి.  అవసరమైతే పరుగులు తీయాలి.  ఇవన్నీ చేయాలి అంటే శరీరానికి ఎక్సర్ సైజ్ అవసరం అవుతుంది.  


కానీ, పోలీసులకు ఆలా కాదు.  కానిస్టేబుల్ గా చేరిన తరువాత కొన్నాళ్ళకు తెలియకుండానే పొట్ట వస్తుంది.  పొట్ట కారణంగా పరిగెత్తలేరు.  అనుకున్న పనులు చేయలేరు.  దొంగలను పట్టుకోవడానికి ధైర్యసాహసాలు ప్రదర్శించలేరు.  దానికి పొట్ట కారణం.  అందుకే పొట్ట ఉన్న పోలీసులపై రాజస్థాన్ దృష్టి సారించింది.  రాజస్థాన్ లోని బికనీర్ జిల్లా ఎస్పీ ఇటీవలే పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.  


జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పొట్ట, అధిక బరువు ఉన్న పోలీసుల వివరాలను నవంబర్ 1 వ తేదీలోగా ఎస్పీ కార్యాలయానికి అందజేయాలని, ఒకవేళ ఏదైనా కారణంగా అందజేయని పక్షంలో ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  పొట్టలు తగ్గించుకోవడానికి, ఫిట్ గా ఉండటానికి పోలీసులను సమయాత్తం చేస్తున్నారు.  పోలీస్ ఉద్యోగంలో చేసే సమయంలో అందరు ఫిట్ గానే ఉంటారు.  


కానీ, జాయిన్ అయిన తరువాత లంచాలకు, కూర్చొని తినేందుకు అలవాటు పడి పొట్టలు పెంచేస్తున్నారు.  ఇలా పొట్టలు పెంచడం వలన శరీరానికే కాదు.. దానివలన సమాజానికి కూడా చేటు జరుగుతుంది. అందుకే వీరిపై బికనీర్ ఎస్పీ కార్యాలయం దృష్టి పెట్టింది.  ఎస్పీ నుంచి ఆదేశాలు రావడంతో.. చేసేదిలేక జిల్లాపరిధితో ఉన్న పోలీసులు కొలతలు కొలిచి లిస్ట్ తయారు చేస్తున్నారు.  ఈ లిస్ట్ లో ఎంతమంది వస్తారో చూడాలి.  ఒక్క రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలోనే కాదు.. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇలానే చేస్తే ఎంత బాగుంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: