ఈ రోజు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయ్యింది. నేటి మధ్యాహ్నం కల్లా తుది ఫలితాలు దాదాపుగా తెలిసిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. నేడు మహారాష్ట్రలోని 288, హర్యానాలోని 90 స్థానాల పోలింగ్ ఫలితాలతో పాటుగా 16 రాష్ట్రాలు., ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 51 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నట్లు సమాచారం.. ఇవేగాక మహారాష్ట్ర లోని సతారా., మధ్యప్రదేశ్ లోని సమస్తీపూర్ లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వైనం మనం చూస్తున్నాం..

 

2014 ఎన్నికల ఫలితాలలో మహారాష్ట్రలోని 288 స్థానాలలో బీజేపీ మహా కూటమి మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలను సాధించి గెలుపొందింది.. అయితే ఈ సంవత్సరం కూడా బీజేపీ హవా నే కొనసాగనున్నట్లు ఎగ్జిట్ పోలే సర్వే వెలువడించింది.. హర్యానా లోనూ ఇదే పరిస్థితి.. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ముందంజలో వున్నట్లుగా తెలుస్తుంది.. అయితే ఈ రోజు బీజేపీ హవా ఇంతలా పెరగడానికి కారణం ప్రతిపక్ష పార్టీల వైఫల్యమేనా..?? నేడు దేశంలో బీజేపీ హవా చూస్తుంటే కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకుపోయే అవకాశాలు లేకపోనులేదు..

 

ఇక తెలంగాణా రాష్ట్రం లోని హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాలలో మొదటి స్థానంలో టి.ఆర్.ఎస్., రెండవ స్థానంలో కాంగ్రెస్., మూడవ స్థానంలో బీజేపీ., నాల్గవ స్థానంలో టీడీపీ ఆధిక్యం లో వున్నట్టుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.. తెలంగాణా లో కేసీఆర్ కు ఎదురులేదనే విషయం అందరికి తెలిసినదే.. కానీ!! మొన్న జరిగిన ఆర్టీసీ సమ్మె ప్రభావం కేసీఆర్ పై ఎంత పడింది..!! అసలు ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ఫలితాలు విడుదల అయ్యేంత వరకూ వేచి చూడాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: