మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో బీజేపీ - శివ‌సేన కూమ‌టి 170కు పైగా సీట్ల‌తో స్ప‌ష్ట‌మైన మెజార్టీ దిశ‌గా దూసుకుపోతుంటే మ‌రోవైపు కాంగ్రెస్ + ఎన్సీపీ కూట‌మి వెన‌క‌ప‌డిపోయింది. ఇదిలా ఉంటే మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో ఎంఐఎంతో పాటు అంబేద్కర్ ముని మనమడు ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అగాడీ (వీబీఏ) సంచ‌ల‌నాల దిశ‌గా దూసుకు వెళుతున్నాయి. ఎంఐఎం ఇప్ప‌టికే 44 స్థానాల్లో భారీగా ఓట్లు చీల్చ‌డంతో పాటు 4 చోట్ల గెలుపు బాట‌లో ఉంది.


ఇక వీబీఏ పార్టీ ఈ ఎన్నిక‌ల్లో అనూహ్యంగా పుంజుకుంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానమూ గెలవలేకపోయింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం మహా అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వీబీఏ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భారతదేశంలో దళిత-బహుజన ఉద్యమాలకు మూల పురుషులైన జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ మహారాష్ట్ర వారే కావడం వల్ల అక్కడి దళితుల్లో సామాజిక చైతన్యం మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఎక్కువగానే ఉంటుంది.


అయితే ఇదంతా ఇప్పటి వ‌ర‌కు సామాజిక ఉద్య‌మాల‌కే ప్ర‌భావం అవ్వగా... ఇప్పుడు అనూహ్యంగా ఏబీఏ రాజ‌కీయంగా కూడా అనూహ్యంగా దూసుకు వెళుతోంది. అయితే ఏబీఏ వ‌ల్ల కాంగ్రెస్‌కు మైన‌స్ అయ్యింది. ఏబీఏ ద‌ళితుల ఓట్లు భారీగా చీల్చుకోవ‌డంతో కాంగ్రెస్ సంప్ర‌దాయ ఓటు బ్యాంకుకు గండిప‌డింది. ఇక మైనారిటీ ఓటు బ్యాంకును ఎంఐఎం చీల్చింది. దీంతో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బపడింది. ఇది పరోక్షంగా బీజేపీ-శివసేనకు అనుకూలంగా మారింది. ద‌ళితులు, మైనార్టీల ఓట్లు చీలిపోవ‌డం కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బే.


ద‌ళితులు రాజ్యాధికారం చేప‌ట్టాల‌ని అంబేద్క‌ర్ చాలా సంద‌ర్భాల్లో చెప్పాడు. ఇది యూపీలో మిన‌హా ఆయ‌న పుట్టిన మ‌హారాష్ట్ర‌లో కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆయ‌న మ‌న‌వ‌డు స్థాపించిన ఏబీఏ రాజ‌కీయంగా కూడా సంచ‌ల‌నాలు సాధించే దిశ‌గా దూసుకుపోతుండ‌డం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: