హర్యానా ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఫలితాలు పరిశీలిస్తుంటే.. నువ్వా నేనా అన్నట్టుగా వస్తున్నాయి.  ఏ పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.  హర్యానాలో బీజీపీ ఆధిక్యంలో ఉన్నా అధికారం చేపట్టాలి అంటే కొంత మంది సపోర్ట్ ఆవాసరం అవుతుంది.  ఎంత అవసరం ఏంటి అన్నది మరికాసేపట్లోనే తేలిపోతుంది.  భారీ వ్యతిరేకత లేకపోయినా కొద్దిమేర వ్యతిరేకత ఉన్నట్టుగా దీనిని బట్టి తెలుస్తోంది.  లోకల్ నాయకత్వ లోపమే ఎలా కొంత తడబడటానికి కారణం అని చెప్పొచ్చు.  


అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ 60 కిపైగా స్థానాలు వస్తాయని అన్నాయి.  కానీ, వస్తున్న రిజల్ట్ చూస్తుంటే దానికి విరుద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.  గెలుపోటములు అన్నవి సహజమే.  కానీ, హర్యానాలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  అధికారంలోకి వస్తే... ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అన్నది తెలియాలి.  ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే కొన్ని సీట్లు ఎక్కువగా వచ్చాయి.  ఇది ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారింది.  ఇక జేజేపీ కూడా కొంతమేర బలపడింది.  


స్వతంత్రులు కూడా దాదాపు 9 స్థానాల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమే.. అయితే, బీజేపీ ఎవరితో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వస్తుంది అన్నది తెలియాల్సి ఉన్నది.  కాంగ్రెస్ పార్టీ 29 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉండటంతో జేజేపీ కలిసినా.. ఇంకా కొన్ని సీట్లు అవసరం అవువుతుంది.  స్వతంత్రుల మద్దతు కూడా తీసుకోవాలి.  ఇంతమందితో కలిసి పోటీ పార్టీని ఏర్పాటు చేయడం అంటే అది రిస్క్ తో కూడుకున్న అంశం అని చెప్పాలి.  


ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జేజేపీకి ఓ ఆఫర్ ను ఇచ్చింది.  కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే.. జేజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది.  అంటే కర్ణాటక తరహాలో అఫర్ ను ఇస్తోంది.  కర్ణాటకలో ప్రభుత్వం ఎలా నడిచిందో చెప్పక్కర్లేదు.  కేవలం 13 నెలల్లోనే కూలిపోయింది.  ఆ పార్టీకి చెందిన నేతలు కొంతమంది కేసులు ఎదుర్కొంటున్నారు.  
ఇప్పుడు జేజేపీ కూడా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే.. భవిష్యత్తులో ఇలాంటి కేసులు ఎదుర్కోవలసి వస్తుందనే భయం ఉన్నది.  అందుకే జేజేపీ ఆలోచనలో పడింది.  కాంగ్రెస్ ఆఫర్ చేస్తున్న ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాలా వద్దా అని పార్టీ ఆలోచిస్తోంది.  ఇక రెండో విధంగా చూసుకుంటే, స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా కాంగ్రే చూస్తున్నది.  ఇది సాధ్యం అవుతుందా కాదా అన్నది తెలియాల్సిన ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: