ఈ మధ్యకాలంలో ఆడవాళ్లు రాత్రి పూట రోడ్లపై తిరగాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.  అంటే పాత్  కాలంలో కూడా ఇదే పరిస్థితి అనుకోండి. మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలన్న విజన్ తో సీఎం కేసీఆర్ 2014 అక్టోబర్ 24న ‘షీ టీమ్స్’ను ప్రారంభించారు. 
వీరిని వంద బృందాలు ఏర్పాటు చేసి, మహిళలు, యువతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో నిఘా పెట్టారు.  ప్రధానంగా బస్టాండ్లు, రైల్వే స్టేసన్‌లు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, సినిమా హాల్స్ వంటి ప్రాంతాల్లో నిఘా ఉంచారు.


ఈ రోజుతో షీ టీమ్స్’ ను ఏర్పాటు చేసి ఐదేళ్లు పూర్తయ్యుంది. ఈ ఐదేళ్ల కాలంలో 33,700 కేసులను ‘షీ టీమ్స్’ పరిష్కరించగల్గింది. మహిళల హక్కుల పరిరక్షణకు ‘షీ టీమ్స్’ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. నేరస్థులను పట్టుకోవడం, చిన్న నేరస్థులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు అరికట్టడంలో ‘షీ టీమ్స్’ ప్రధాన పాత్ర పోషింస్తాయి. అంతే కాదు వీరు మహిళల హక్కులకు సంబంధించి వారిని చైతన్య పరచడంతో పాటు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.


తాజాగా సమంత.. తెలంగాణలో షీ టీమ్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ పోకిరిల నుంచి ఆడవాళ్లను కంటికి రెప్పలా కాపాడుతున్న షీ టీమ్స్ ఏర్పడి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షీ టీమ్స్ వల్ల.. నా లాంటి ఎందరో ఆడవాళ్లకు పోలీసులపై ప్రభుత్వంపై  ఓ నమ్మకం ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా షీ టీమ్స్‌కు  కృతజ్ఞతలు తెలిపింది.తెలంగాణలో ఇదో అద్భుతమని వ్యాఖ్యానించింది.


 ప్రస్తుతం సమంత.. తతమిళంలో సూపర్ హిట్టైన ‘96’ తెలుగు రీమేక్‌లో నటించింది.  తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా, పోకిరీలను నిలువరించడంలో విశేషమైన కృషి చేస్తున్న షీ టీమ్స్ ను మరింత బలోపేతం చేయనున్నామని నిన్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: