వైఎస్ జగన్ ఒకే ఒక్క నిర్ణయంతో బ్రాహ్మణ సామాజిక వర్గం మనసు గెలుచుకున్నాడు.. అర్చకుల వంశపారంపర్య హక్కును అమలు చేసేలా జీవో 439 జారీ చేసి ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకున్నారు. ఈ నిర్ణయంతో పాదయాత్ర సందర్భంలో పూజారులకు నాడు ఆయనిచ్చిన హామీ నెరవేరినట్టైంది. చంద్రబాబు హయాంలో అసంతృప్తిగా ఉన్న ఈ సామాజిక వర్గం వారు ఇప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అర్చకులకు వంశపారంపర్య హక్కును కల్పిస్తూ చట్టం తీసుకురాడవంతో హ్యాపీ గా ఫీలవుతున్నారు.


గతంలో చంద్రబాబు హయాంలో వివిధ కారణాలతో పలు ఆలయాలు కూలగొట్టారు. బాబు హయాంలో కూల్చిన ఆలయాలను తిరిగి నిర్మించేందుకు యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పూనుకుంటున్నారు. అంతేకాదు.. అర్చకులకు వేతనాలను పెంచారు. చిన్న ఆలయాల దీప, ధూప, నైవేద్యాలకు నిధులు ఏర్పాటు చేసారు. తిరుమల తిరుపతి ఆలయంలో అన్యమత ప్రచారం, అన్యమత ఉద్యోగుల ఏరివేతకు చట్టం తెచ్చారు. తిరుపతిలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.


ఇలాంటి నిర్ణయాలు బ్రాహ్మణులను ఆకట్టుకుంటున్నాయి. తిరుమల కొండపై అతి తక్కువ ఖరీదుకే ఫలహారం, భోజనాలు విక్రయించేలా జగన్ చర్యలు తీసుకున్నారు. సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రత్యేక దర్శనాలను రద్దు చేసారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలకు వినియోగించాలని నిర్ణయించారు. దీనిద్వారా మత మార్పిడులకు అడ్డుకట్ట వేయనున్నారు.


అందుకే..హిందూత్వ పరిరక్షణకు, హిందూ ఆలయాల ఉద్ధరణకు, అర్చకుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను శతమానం భవితి అని ఆశీర్వచనాలు అందిస్తూ మూడు రోజులు ప్రత్యేక పూజలు జరిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య.


మరింత సమాచారం తెలుసుకోండి: