మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో - బీజేపీ శివసేన కూటమి మరోసారి అధికారం దక్కించుకుంది. ఇక హ‌ర్యానాలో ప్రస్తుతానికి హంగ్ వాతావరణం ఉన్నా తిరిగి బిజెపి ప్రభుత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నిక‌లు అన్నాక‌ రికార్డులు బద్దలు కొట్టడం... కొత్త రికార్డు నెలకొల్పడం మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. వైసీపీ ప్రభుత్వం ఏకంగా 151 సీట్లు సాధించి విజయం సాధించడం కూడా సరికొత్త రికార్డు గా నిలిచింది.


మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్సీపీకి చెందిన అజిత్ ప‌వార్ ఓ భారీ రికార్డును నెలకొల్పి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు రికార్డును బద్దలు కొట్టాడు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు స్వయానా మేనల్లుడు అయిన అజిత్ పవార్ 1991 నుంచి పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామ‌తి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నాడు. బారామాతి లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలోకి ఈ బారామ‌తి అసెంబ్లీ సెగ్మెంట్‌ కూడా వస్తుంది. తాజా ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గోపీచంద్ 1.65 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక మెజార్టీ హరీష్‌రావు పేరిట ఉంది. గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో హరీష్‌రావ‌వు సిద్దిపేటలో 120650 ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇప్పుడు అజిత్‌ప‌వార్ 165265 ఓట్ల మెజార్టీతో హ‌రీష్ రికార్డును క్రాస్ చేశాడు. ఇక హ‌రీష్‌రావు మ‌రో రికార్డును సైతం ప‌వార్ క్రాస్ చేశాడు. అదే హ‌రీష్ డ‌బుల్ హ్యాట్ర‌క్ రికార్డు. వీరిద్ద‌రు కూడా పార్టీ నేత‌ల మేన‌ళ్లుళ్లు కావ‌డం విశేషం.


ఇక మ‌రో కాంగ్రెస్ నేత విశ్వ‌జిత్ క‌దం కూడా 1.62 ఓట్ల మెజార్టీతో రికార్డు సాధించాడు. ఇక హీరో రితీష్ దేశ్‌ముఖ్ సోద‌రుడు ధీర‌జ్ దేశ్‌ముఖ్ సైతం తొలి ఎన్నిక‌ల్లోనే 1.21 ల‌క్ష‌ల మెజార్టీతో హ‌రీష్‌రావు రికార్డును క్రాస్ చేశాడు. ఏదేమైనా హ‌రీష్ రికార్డును మ‌హా ఎన్నిక‌ల్లో ఏకంగా ముగ్గురు క్రాస్ చేసేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: