ధర్మ పోరాట దీక్షలు పేరిట తన సొంత రాజ్కీయ ప్రయోజనలను నెరవేర్చుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఖజానా నుంచి ఎలా తీసుకుంటాని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. బాబు రాజకీయాల  కోసం ప్రజాధనాన్ని అడ్డగోలుగా  వాడేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన బాబు తీరుపై  షాకింగ్ కామెంట్స్ చేశారు.


గత ఏడాది కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని మోడీ  మీద విరుచుకుపడుతూ చంద్రబాబు వరసగా పోరాట దీక్షలకు దిగిన సంగతి విధితమే. ఈ క్రమంలో బాబు ఒక్క రోజు దీక్షకు పది కోట్ల రూపాయలు సర్కార్ ఖజానా నుంచి ఖర్చు చేయడమేంటని నాని నిలదీశారు. అసలు రాజకీయ దీక్షలకు ధర్నాలకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. అసలు ఇంతకీ ఇలా సర్కార్ నిధులు విడుదల చేసిన అధికారి ఎవరు అని కూడా నాని ప్రశించారు.  ఇదిలా ఉండగా బాబు రాజకీయ దీక్షలపై సర్కార్ ధనాన్ని వెచ్చించిన వ్యవహారం ఇపుడు రాజకీయ రచ్చ రేపుతోంది.


దీని మీద వేసిన ప్రజా వ్యాజ్యం పై విచారణను హై కోర్టు నవంబర్  1 కి వాయిదా వేసింది.  ఇదిలా ఉండగా పవన్ కల్యాణ్ ఇజం అన్నది జగన్ని విమర్శించడానికేనని కూడా పేర్ని నాని అన్నారు. అయిదేళ్ళ పాటు చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు కూడా పవన్ జగన్నీ విమ‌ర్శించారని, ఇపుడు కూడా మళ్ళీ జగన్నే తిడుతున్నారని నాని ఎత్తి చూపారు. అసలు పవన్ జగన్ మీద విషం చిమ్మడనే తన రాజకీయం అనుకుంటున్నారా అని ఆయన నిలదీశారు.  నిర్మాణాత్మకంగా విమర్శలు చేయడం మంచిదే కానీ పనిగట్టుకుని విమర్శలు చేయడం తగదని ఆయన పవన్ కి సూచించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: