జమ్మూ కాశ్మీర్లో గత 72 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్న ఆర్టికల్ 370 వివాదాన్ని బీజేపీ రెండుసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించింది.  రెండోసారి అధికారంలోకి వచ్చిన 72 రోజుల్లోనే ఈ సమస్యకు పరిష్కారం చూపించింది.  ఆగష్టు 5 వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.  ఈ నిర్ణయంతో దేశంలోని ప్రజలందరూ హర్షించారు.  చాలా పార్టీలు స్వాగతించాయి.  కాంగ్రెస్ మాత్రం దీనికి వ్యతిరేకంగా మాట్లాడింది.  


కర్ఫ్యూ వాతావరణం సృష్టించి రద్దు చేయడం తగదని, ఒకవేళ అలా చేస్తే దాని వలన చాలా సమస్యలు వస్తాయని, బలగాలను అక్కడి నుంచి తరలించిన తరువాత పెద్ద ఎత్తున అక్కడ అల్లర్లు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ చెప్పింది.  కానీ, బీజేపీ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నది.  అలాంటి అలజడులు ఏవి జరగవని హామీ ఇచ్చింది.  ఇక మెల్లిగా అక్కడ పరిస్థితులు సర్దుకోవడంతో.. జమ్మూ కాశ్మీర్ లో ఆంక్షలను సడలిస్తూ వస్తున్నారు.  


ఇలా సడలిస్తూ సడలిస్తూ వస్తుండటంతో.. క్రమంగా అక్కడ పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటె,నిన్నటి రోజున అక్కడ ప్రాంతీయ అభివృద్ధి మండలికి ఎన్నికలు జరిగాయి.  310 బ్లాకుల్లో ఎన్నికలు జరిగాయి.  మొత్తం 1090 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.  ఎన్నో సంవత్సరాలుగా అక్కడ వీటికి ఎన్నికలు జరగడం లేదు.  కారణం, ఎన్నికలు నిర్వహిస్తే.. అభివృద్ధి చూపించాలి.  అక్కడ అభివృద్ధి మాట అటుంచితే.. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా వారిని పక్కదోవ పట్టించింది అప్పటి ప్రభుత్వం.  


దీంతో యువత రాళ్లు విసిరే వ్యక్తులుగా మారిపోయారు.  ఇండియన్ ఆర్మీపై రాళ్ళూ విసురుతూ వారిని ఇబ్బందులు పెట్టారు.  కానీ, ఇప్పుడు అలా జరగదు. ఎందుకంటే.. ఆర్టికల్ 370 రద్దు జరిగింది.  ఇప్పుడు దేశాన్ని, జాతీయ జెండాను తులనాత్మకంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవు.  అసలు విషయం ఏమిటంటే.. నిన్న జరిగిన ప్రాంతీయ అభివృద్ధి మండలి ఎన్నికల్లో దాదాపుగా 98శాతం పోలింగ్ జరిగింది.  ఈస్థాయిలో పోలింగ్ జరగడానికి కారణం ఆర్టికల్ 370 రద్దు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.  ప్రజలు స్వేచ్ఛగా పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటు వేశారని, ఎక్కడా కూడా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదని మోడీ పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: