ఇసుక కృత్రిమకొరత, వైసీపీనేతల ఇసుకమాఫియా, దోపిడీకి నిరసనగా,  రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశంపార్టీ చేపట్టిన నిరసనప్రదర్శనలు, ధర్నా కార్యక్రమాలు విజయవంతమ య్యాయని, ప్రజాసంఘాలు, భవననిర్మాణ కార్మికులు భారీసంఖ్యలో నిరసనల్లో పాల్గొన్నార ని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.  సిమెంట్‌ కంపెనీలతో కుమ్మక్కైన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఇసుకపాలసీ పేరుతో కాలయాపన చేసి, చివరికి తూతూమంత్రంగా కొత్తపాలసీని తీసుకొచ్చారని చినరాజప్ప ఆరోపించారు.  

ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌చేసుకోమంటున్న ప్రభుత్వం, ఇసుకను సామాన్యుడికి అందుబాటు లో లేకుండా చేసిందన్నారు. సహజవనరులు ప్రజలకు అందుబాటులో లేకుండాచేసిన వైసీపీ ప్రభుత్వచర్యలకు నిరసనగా, టీడీపీచేపట్టిన ధర్నా విజయవంతమవడమే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. రాష్ట్రమంత్రులు రాజధాని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీచేసిన ధర్మపోరాటదీక్షపై దుష్ప్రచారం చేస్తున్నారని చినరాజప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు. 


రాష్ట్రరాజధాని నిర్మాణాన్ని ఒకసత్సంకల్పంతో చంద్రబాబు ప్రారంభించా రని,  ఆప్రాంతంలో రూ.8వేలకోట్లతో నిర్మాణాలు చేస్తే, రూ.30వేలకోట్ల అవినీతి జరిగిందని తప్పుడుప్రచారం చేయడం సరికాదన్నారు. రాజధానిలో కనీసవసతులు లేవని, రాష్ట్ర  హైకోర్టుచేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఆలోచించాలని మాజీమంత్రి సూచించారు. అమరావ తి నిర్మాణాన్ని ఆపేయాలన్న దురుద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్‌, బొత్స సత్యనారాయణతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడన్నారు.ప్రమాదాలనేవి సహజంగా జరుగుతుంటాయని, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వాటిని కూడా రాజకీయ అంశాలుగా వాడుకుందని, చంద్రబాబు ప్రభుత్వంలో పడవప్రమాదం జరిగితే నానాయాగీ చేసిన జగన్మోహన్‌రెడ్డి, కచ్చులూరు దుర్ఘటనపై ఎంతచిత్తశుద్ధితో వ్యవహరిం చాడో రాష్ట్రమంతా చూసిందన్నారు. పడవమునిగిన 30రోజుల తర్వాత మేల్కొన్న వైసీపీ ప్రభుత్వం, విధిలేనిపరిస్థితుల్లో దర్మాడిసత్యం సాయంతో, దాన్ని బయటకు తీసిందని నిమ్మకాయల ఎద్దేవాచేశారు. ధర్మాడి ఆయన బృందాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు  మెచ్చుకుంటే దాన్ని తప్పుపట్టిన మంత్రికన్నబాబు, బోటుని బయటకుతీయలేని తనప్రభుత్వ అసమర్థతను ఎందుకు అంగీకరించడంలేదన్నారు. 


ముఖ్యమంత్రిజగన్‌, అమిత్‌షాల భేటీలో ఏం జరిగిందో రాష్ట్రమంతా తెలిసినా, తమనాయకుడు ఢిల్లీవెళ్లి ఏదో ఘనకార్యం   చేశాడని వైసీపీనేత అంబటిరాంబాబు ప్రగల్భాలుపలకడం హాస్యాస్పదంగా ఉందని చినరాజప్ప  దెప్పిపొడిచారు. మరోమంత్రి పేర్నినాని చంద్రబాబు చేసిన దర్మపోరాటదీక్ష ఖర్చుని గురించి అబద్ధపు ప్రచారంచేస్తున్నాడని, ఆయన ఆనాడు ఎంతఖర్చుచేశాడో, ఇప్పుడు    ప్రభుత్వంలో ఉన్న అధికారులను అడిగితే నానికి తెలుస్తుందన్నారు. తాడేపల్లిలో జగన్‌ నివాసానికి, హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి, పులివెందులలోని గృహానికి అదనపు హంగులకోసం, రాష్ట్రఖజానా నుంచి ఎంతెంతఖర్చుచేశారో, రాష్ట్రమంత్రిగా ఉన్న పేర్నినా నీయే తెలియచేస్తే రాష్ట్రప్రజలంతా సంతోషిస్తారని చినరాజప్ప స్పష్టంచేశారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: