ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.  ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి కోసం కేంద్రం అనేక మార్గాలను ఎంచుకుంది.  దాదాపు 60 రోజుల కట్టుదిట్టమైన భద్రత తరువాత రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాయి.  ఒక్కో ప్రాంతంలో ఆంక్షలను సవరించుకుంటూ వస్తున్నారు.  తాజాగా అన్ని ప్రాంతాల్లో ఆంక్షలను ఎత్తివేశారు.  ఇప్పుడు అక్కడ ఎలాంటి ఆంక్షలు లేవు.  


దీంతో అక్కడ అభివృద్ధికి మార్గం సుగమం అయ్యింది.  ప్రభుత్వం అభివృద్ధి కోసం గతంలో వేసుకున్న రోడ్ మ్యాప్ ను ఇప్పుడు అమలు చేయబోతున్నది.  అక్టోబర్ 31 నుంచి పూర్తిగా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారబోతున్నది.  ఈ తరుణంలో జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమించింది కేంద్రం.  ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, లడక్ లలో గవర్నర్ గా ఉన్న సత్యపాల్ మాలిక్ ను గోవా కు షిఫ్ట్ చేసింది.  జమ్మూ కాశ్మీర్ కు మాజీ ఐఏఎస్ అధికారి గిరీష్ చంద్రను లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా నియమించింది.  


ఈయన ఆర్థికశాఖలో సెక్రటరీగా పనిచేశారు. 1985 బ్యాచ్ కు చెందిన ఈ మాజీ ఐఏ ఎస్ అధికారి గతంలో గుజరాత్ లో మోడీ ప్రభుత్వంలో అనేక కీలక శాఖల్లో పనిచేశారు.  అయన తన పనితీరుతో ఆకట్టుకున్నాడు.  దీంతో ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన్ను కేంద్ర ఆర్థికశాఖకు బదిలీ చేశారు.  కాగా, ఆయన్ను ఇపుడు జమ్మూకాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా నియమించారు.  దీనికి ఓ కారణం ఉంది. 


జమ్మూ కాశ్మీర్ ను ఆర్ధికంగా ఎదిగేవిధంగా చూడాలి.  అన్ని రంగాల్లో జమ్మూ కాశ్మీర్ ఎదగాలి అంటే ఆర్ధికంగా బలంగా ఉండాలి.  అందుకోసమే మోడీ ప్రభుత్వం ఏరికోరి గిరీష్ చంద్రను నియమించింది.  గిరీష్ చంద్ర ఆర్థికశాఖా నిపుడు మాత్రమే కాదు, అయన విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి.  అందుకే ఆయన్ను జమ్మూ కాశ్మీర్ కోసం ఎంపిక చేశారు.  ఇక 1977 బ్యాచ్ కు చెందిన మరో అధికారి రాధాకృష్ణ మాధుర్ ను లడక్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా నియమించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: