ఇటీవల ఏపీ సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే. దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమమయ్యారని అన్ని పత్రికలూ రాశాయి ఎల్లో మీడియాగా చెప్పుకునే తెలుగు అగ్రశ్రేణి పత్రికలు కూడా అదే రాశాయి. ఆ తర్వాత సుజనాచౌదరి జగన్ - అమిత్ షా బేటీ అంతసేపు జరగలేదు..ఏదో లెటర్ ఇచ్చి వచ్చాడంతే అని అన్నారు.


సుజనా చౌదరి మాటలను హైలెట్ చేస్తూ మరోసారి ఇదే వార్తను ఎల్లో మీడియా ఫోకస్ చేసింది. సుజనా చౌదరి చెప్పినట్టుగా ఇచ్చిన ఈ కథనంలో సబ్ హెడ్డింగ్స్ లో సీఎం జగన్ గారు హోం మంత్రికి శుభాకాంక్షలు తప్ప మరేం చెప్పలేదని రాసింది. దీనిని వైసీపీ సోషల్ మీడియా ఎండగట్టింది.


అంటే రెండ్రోజుల క్రితం ఎల్లో మీడియా రాసిన వార్తలన్నీ అబద్ధాలా? లేక నేడు సుజనా చౌదరి చెబుతున్న మాటలు అబద్ధాలా? అంటూ నిలదీసింది. ఏపీ సిఎం కు అమిత్‌ షాకు మధ్య చర్చలేం జరగలేదని సుజనా చౌదరి అన్నట్టు ఇచ్చిన ఈ కథనంలో లోపల మాత్రం వినతి పత్రం ఇచ్చినట్టు రాసుంది. అందులో డిమాండ్లన్నీ తీర్చదగ్గవి కాదని సుజనా స్పష్టం చేసాడట.


విభజన హామీల విషయంలో లేఖలు ఇచ్చినట్టు ఓ పక్కన ఒప్పుకుంటూనే అమిత్ షా తో చర్చలే జరగలేదని కారుకూతలు ఎలా కూస్తారని ప్రశ్నించింది.అన్న సుజనా చౌదరికి బుద్ధి బురదగుంటలోకి పోతే రాసే ఎల్లో మీడియా కు ఆ సెన్సు ఎందుకు కరువైంది? కనీసం సుజనా ప్రెస్ మీట్లో అయినా 'సీఎం 45 నిమిషాల భేటీ' గురించి రాసిన ఎల్లో మీడియా విలేఖరులు ఈ ప్రశ్నలెందుకు అడగలేకపోయారు ? అయినా బీజేపీ కండువా కప్పుకున్న టీడీపీ వీరవిధేయ సుజనా చౌదరికి ఏపీ డిమాండ్లు నిర్హేతుకం అనే అర్హత ఎక్కడి నుంచి వచ్చింది?


ప్రధాని మోదీ చెప్పారా? లేక అమిత్‌ షా చెప్పమన్నారా? లేదా చంద్రబాబు ఇలా ప్రచారం చేయమని కబురు పంపారా? పచ్చమీడియా కక్కుతున్న అబద్ధాల విషాన్ని ప్రజల ముందు బట్టబయలు చేసేందుకే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తప్పుడు వార్తల విషయంలో చర్యలు తీసుకోమని కార్యదర్శులకు అధికారం ఇచ్చారని గుర్తు చేసింది.


2019 ఎన్నికల ఫలితాలు బాబుకు బాకాలూదిన ఎల్లో మీడియాకు కరెంటు షాకుల్లాంటివి…జర్నలిజాన్ని ఎర్నలిజంగా, ఎల్లో ఇజంగా మార్చిన పచ్చ మీడియాకు ఎర్రని హిట్ లాంటిది వైసీపీ సోషల్ మీడియా.. ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేయబోయినప్పుడల్లా వాస్తవాలను అది ప్రజల ముందుంచుతూనే ఉంటుందని సవాల్ విసిరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: