ఈ ఎన్నికల్లో ప్రజలు పరిణితి ప్రదర్శించారు. రాజకీయ అవసరాలతో గెలుపు కోసం ఎన్నికలముందు పార్టీలు మరిన వారిని ప్రజలు ఎన్నికల్లో ఓడించి పిచ్చికుక్కల్ని కొట్టినట్టు కొట్టి తరిమి తరిమి ఓడించారు. ఇది పార్టీ మారే ప్రజాప్రతినిధులకు ఒక గుణపాఠమే. ఛతప్రతి శివాజీ నడయాడిన మరాఠా అవనిపై మళ్లీ "కాషాయం" వికసించింది. కానీ ఆ వికాసంలో సుగంధం కొంత తగ్గింది. ఏదేమైనా అధికారం మరోసారి కమలానికే దక్కనుంది. అయితే బిజేపికి ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి.

*తన మిత్ర పక్షం శివసేనతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు...లేదా మద్దతుతో బిజేపి ప్రభుత్వం ఏర్పాటు. కానీ, మిత్రపక్షం శివసేన షరతులు బిజేపిని కలవర పెడుతోంది. బీజేపీకి ఇటీవలి కాలంలో తొలిసారి మహారాష్ట్ర రూపంలో కఠినమైన ఎన్నికల పరీక్ష ఎదురైంది. అభిప్రాయ భేదాలను ‘పక్కన పెట్టి’ శివసేనతో కలిసి పోటీ చేసిన నేపథ్యం లో, సులువుగా అధికారంలోకి వస్తామని బీజేపీ భావించిన బిజేపి గతకాలం నాటి బలం కోల్పోయి, శివసేనపై పూర్తిగా ఆధారపడి, తప్పనిసరైతే ఆ పార్టీతో ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునేందుకు అంగీకరించాల్సిన పరిస్థితి ఎదురైంది. 2014 ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీచేశాయి. అయినప్పటికీ అప్పట్లో బీజేపీ 122 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 105 స్థానాలకే పరిమితమైంది. అంటే శివసేనతో ఎన్నికలో పాల్గొన్నా 17 స్థానాలు కోల్పోయిందన్న మాట. మరి ఒంటరిగా పోటీచేసి ఉంటే?

Image result for bjp after maharashtra results

*రాజకీయాల్లో శాశ్వత శత్రులు లేదా శాశ్వత మిత్రులు ఉండరన్న రాజకీయ సిద్ధాంతంతో అవకాశం ఉంటే శరద్ పవార్ లాంటి మరాఠా యోధుని పార్టీ ఎన్సీపి తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. గతంతో పోల్చితే ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి బాగా బలం పుంజుకున్నప్పటికీ, అధికారానికి ఆమడ దూరంలో నిలిచింది. బీజేపీని రెబల్స్‌ దెబ్బకొట్టగా, ఎన్సీపీ - కాంగ్రెస్‌ కూటమికి ఎంఐఎం పోటీ బాగానే గండి కొట్టింది.

గత నెల 21న జరిగిన ‘మరాఠా పోరు’ ఫలితాలలో 288 స్థానాలున్న మహారాష్ట్ర శాసనసభలో బీజేపీ, శివసేన కలిస్తేనే "మేజిక్‌ మార్క్" ను దాటాయి. అయితే రెండొందలకు పైగా సీట్లు సాధించాలన్న వారి లక్ష్యానికి ఆమడ దూరంలో స్థానాలు లభించాయి. బలం తగ్గి బలహీనపడ్డ బీజేపితో శివసేన అనూహ్యంగా తమకూ సగం కాలం అధికారం పంచాలనే షరతును ఒక ఆయుధంగా తీసుకొచ్చింది. ఇప్పుడీ విషయంలో బీజేపి మింగలేక్ కక్కలేక గింజుకుంటునది. బిజేపి శివసేనతో బంధం కూడా మూడు విమర్శలు ఆరు కొట్లాటలతో కిరికిరిగా సాగుతూవస్తుంది.

Image result for bjp after maharashtra results మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, శివసేన అధిపతి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడైన ఆదిత్య ఠాక్రే తదితర ప్రముఖులు విజయం సాధించారు. ఇక సరిగ్గా ఎన్నికల ముందు పార్టీల మారిన వారిని ప్రజలు ఆదరించలేదు. శివసేనలో చేరి బరిలో నిలిచిన 11 మంది, బీజేపీ తీర్థం పుచ్చుకుని పోటీపడిన 8 మంది ధారుణ ఓటమికి గురయ్యారు. వీరిలో కొందరు మంత్రులు కూడా ఉండటం గమనార్హం. ఇందులో ప్రజా తీర్పులో విఙ్జత కనిపిస్తుంది. విజయదర్హాసంతో రెచ్చిపోయే బీజేపికి ఎంతోకొంత వ్యతిరేఖత రావటం మంచిదే. కాకపోతే శివసేన దురాశను తీర్చటానికి బిజేపి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయాల్సిందే! దానికంటే శరద్ పవార్ లాంటి సీనియర్ రాజకీయవేత్తతో పొత్తు పెట్టుకుంటే బిజేపికి ఎంతో కొంత మేలు జరగవచ్చని అంటున్నారు. ‘కాషాయం’ ‘కషాయం’గా మారితే ఒకే! ‘విషం’గా మారక ముందే జాగ్రత్త అవసరం

Image result for congress without sonia family

మహారాష్ట్రలో గతంతో పోల్చితే కాంగ్రెస్‌ బలం పుంజుకున్నప్పటికీ, ఫలితాల సరళిలో మూడోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ కంటే మిత్రపక్షమైన ఎన్సీపీయే అధిక స్థానాలు దక్కించుకుంది. రెండు పార్టీలకు 2014 ఎన్నికలకంటే అధిక స్థానాలు లభించడమొక్కటే ఊరట కలిగించే అంశం. గుర్తించాల్సిన విషయం ఏమంటే రాహుల్ గాంధి ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోవటమే ఈ విజయానికి కారణం అనే మాట సర్వత్రా వినిపిస్తుంది. అంటే జనం గాంధి -నెహౄ కుటుంబానికి తిలోదకాలిస్తే కాంగ్రెస్ కు మేలు చేయగలమని చెప్పినట్లే!

Image result for bjp after maharashtra results

మరింత సమాచారం తెలుసుకోండి: