కొన్నిసార్లు మనం మాటలు ఎంత దారుణంగా ఉంటాయి అంటే.. చివరకు ఇంట్లో నిర్మించుకునే బాత్ రూమ్ ల విషయంపై కూడా మాటలు మాట్లాడుతుంటారు.  అలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు.  అలాంటి మాటలు మాట్లాడితే.. దాని వలన ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో అందరికి తెలిసిందే. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, తెలుగుదేశం పార్టీ ఢిల్లీ టూర్ కోసం ఏకంగా పదికోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, దీక్షల కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేసిందని వైకాపా ఆరోపించింది.  


కానీ, వైకాపా చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ తిప్పికోట్టింది.  కోటి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయలేదని స్పష్టం చేసింది.  కావాలంటే ఆర్థికశాఖను అడిగి తెలుసుకోవాలని స్పష్టం చేసింది.  కాగా, ఇపుడు అదే తెలుగుదేశం పార్టీ జగన్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టింది.  జగన్ హంగు ఆర్భాటాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించింది.  


మంగళగిరిలో జగన్ నిర్మించుకున్న క్యాంప్ ఆఫీస్ కోసం భారీగా ప్రభుత్వ నిధులను వినియోగించుకున్నారని, ఇంటి అవసరాల కోసం ప్రభుత్వ నిధులు వినియోగించారని టీడీపీ విమర్శించింది.  జగన్ తన క్యాంప్ ఆఫీస్ లో నిర్మించుకున్న బాత్ రూమ్ కోసం రూ. 48 లక్షల రూపాయలు వినియోగించారని, ఇది ప్రజల సొమ్ముతోనే నిర్మించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.  


అటు సిబిఐ కేసుల కోసం కూడా జగన్ దాదాపు రూ. 60 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఆ డబ్బు కూడా ప్రజల సొమ్ము అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.  ఈ స్థాయిలో ఆరోపణలు చేస్తున్న  తెలుగుదేశం పార్టీకి వైకాపా ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి.  ఒకవైపు రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఈ ఇబ్బందులను అధికమించేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు రావడం ఒకింత ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: