టీఎస్ ఆర్టీసీ కార్మికులు ముందుగానే ఊహించిందే జరిగింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానికి చెప్పుకునేందుకు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించారని జేఏసీ నేతలు చెప్పిందే నిజమైంది. సమ్మె కంటే ముందు మాట్లాడి ఉంటే సమస్యలు పరిష్కారం అయ్యేవని,  ఆర్టీసీ సమ్మె పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల కార్మికులు చనిపోయారని పలువురు జేఏసీ నేతలు వ్యాఖ్యానించారు.  నోటీస్ ఇచ్చిన కూడా తమతో ఎవరు చర్చలు జరపలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రజా సమస్యల మీద ఆలోచన లేదని అన్నారు.  సమస్య పరిష్కారం కోసం సమ్మె చేపట్టిన 22 వ రోజులకు ప్రభుత్వం  చర్చలు అర్ధాంతరంగా ముగిసాయి. ఆ చర్చలకు కూడా కేవలం  నలుగురు కార్మిక నేతలను మాత్రమే అనుమతించడం గమనార్హం.ఈ చర్చల ప్రక్రియను ఆసాంతం వీడియో రికార్డింగ్‌ చేయడం విశేషం. అంతేకాకుండా వారి ఫోన్లను అనుమతించబోమని అధికారులు చెప్పడంతో కార్మిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఫోన్లు సిచ్చాప్‌ చేసిన తర్వాతే చర్చలు ప్రారంభమయ్యాయి.   ఎర్రమంజిల్‌లో ఉన్న ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ‌ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమీషనర్ సందీప్ కుమార్ సుల్తానియా చర్చల్లో పాల్గొన్నారు. ప్రధాన డిమాండ్‌ ఆర్టీసీ విలీనంపై కార్మిక సంఘాల నాయకులు పట్టుబడటంతో చర్చలు అర్థాంతరంగా ముగిసినట్టు తెలుస్తోంది. 
ప్రభుత్వ ఆహ్వానం మేరకే చర్చలకు వెళుతున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ముందే చెప్పారు. అన్ని డిమాండ్లపై చర్చకు పట్టుబడతామన్న ఆయన ప్రత్యేకించి ఒక డిమాండ్‌పై ప్రభుత్వం చర్చలకు పిలవలేదన్నారు. కార్మికులు ధైర్యంగా ఉండాలని చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలు విఫలమైతే ఏం చేయాలనే దానిపై ప్రతిపక్ష నేతలతో చర్చించినట్లు అశ్వత్థామరెడ్డి తెలిపారు.




ఆర్టీసీ పరిరక్షణ కోసమే ఆర్టీసీ జేఏసీ ఈయూ, టీఎంయూ యూనియన్లతో జతకట్టినట్లు తెలిపారు.  ప్రభుత్వం మొండి వైఖరి తో ముందుకు పోతుందని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి మండిపడ్డారు. ప్రైవేట్ బస్ ల కంటే ఆర్టీసీ బస్ లు లాభాలలో నడుస్తున్నాయని రాజిరెడ్డి అన్నారు.  హైదరాబాద్, పల్లె వెలుగు బస్ లు మాత్రమే నష్టాలలో ఉన్నాయని స్పష్టం చేశారు. మిగతా బస్ లు లాభాలలో నడుస్తున్నాయని చెప్పారు.  ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తే యూనియన్ లను వదిలివేస్తామని చెప్పారు.  దసరా పండుగ జరుపుకోలే కనీసం దీపావళి పండుగ జరుపుకునేలా ప్రభుత్వం సానుకూలకంగా స్పందించాలని రాజిరెడ్డి కోరారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో యాజమాన్యం శనివారం జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయన్నారు. మొత్తం డిమాండ్ల పరిష్కారానికి కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టడంతో చర్చలు చివరి వరకు కొనసాగలేదు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు చర్చలకు వచ్చారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: