గత 22 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నారు.  కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని చెప్పిన ఆర్టీసీ యాజమాన్యం ఎట్టకేలకు చివరకు దిగివచ్చి చర్చలకు పిలిచింది. అయితే, ఆ చర్చలు కూడా చేయాలి ఏదో చర్చలు జరపాలి కాబట్టి జరుపుతున్నట్టుగా పిలిచారు.  పైగా అందులో కేవలం కొన్నింటిపై మాత్రమే చర్చిస్తాం అని చెప్పడంతో చర్చలకు పిలిచారు కదా వెళ్లి చూద్దాం అన్నట్టుగా కార్మిక నాయకులు వెళ్లారు.  


లోపలికి వెళ్లిన తరువాత నిర్బంధ చర్చలు జరిపినట్టు కార్మికులు చెప్తున్నారు.  సెల్ ఫోన్స్ లాక్కొని నిర్బంధంగా చర్చలు జరిపారని, 26 డిమాండ్లు ఇస్తే అందులో కేవలం 21 డిమాండ్లు మాత్రమే చర్చలు జరుపుతామని చెప్పడంతో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు.  ఇలాంటి నిర్బంధ చర్చలు ఆర్టీసీ చరిత్రలో ఎప్పడూ చూడలేదని, ఇది దారుణమై విషయం అని కార్మిక నాయకులు అంటున్నారు.  


చర్చలకు పిలిచి ఇలా చేయడం తగదని చెప్తూనే.. తాము ఇచ్చిన 26 డిమాండ్లపై చర్చకు పిలిస్తేనే వస్తామని, 26 డిమాండ్లు చర్చించాల్సిందే అని పట్టుబడుతున్నారు.  చర్చలు విఫలం కావడంతో నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అన్నది జేఏసీతో చర్చలు జరిపిన తరువాత నిర్ణయిస్తారట.  ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చూడాలి.  అయితే, ఇప్పటికే 22 రోజులుగా సమ్మె జరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  


అటు ప్రభుత్వం దిగిరావడం లేదు.  ఇటు ఆర్టీసీ కార్మికులు కూడా తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె విరమించేది లేదని అంటున్నారు.  చర్చలు జరిపమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి చర్చలు జరిపారు.  కాగా, ఇప్పుడు చర్చలు విఫలం అయ్యాయి కాబట్టి తమసైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు అని ప్రభుత్వం చూపించబోతున్నది. హైకోర్టుకు కూడా ఇలానే చెప్తుంది.  పైగా ప్రభుత్వం ఎలాగో ఆర్టీసీని రద్దు చేయబోతున్నట్టు మొన్నటి రోజున కెసిఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి గందరగోళంలో పడిపోయింది.  ఏం జరుగుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: