ఏపీలో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు చాలా ఆస‌క్తిగా ఉంటున్నాయి. ఆయ‌న వేస్తు న్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణ‌యాల లోతుల‌ను ప‌సిగ‌ట్ట‌డం సీనియ‌ర్ల‌కు కూడా సాధ్యం కావడంలేదు . ప్ర‌భుత్వ పాల‌న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే..  ఇటీవ‌ల రాష్ట్రంలోని 13 జిల్లాల‌కు జ‌గ‌న్ గ‌తంలో అంటే అధికారంలోకి వ‌చ్చిన నెల‌లోనే నియ‌మించిన ఇంచార్జ్ మంత్రుల‌ను అక‌స్మాత్తుగా మార్పు చేశారు. ఒక్క చిత్తూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి మిన‌హా అంద‌రినీ మార్పు చేయ‌డంతోపాటు.. అప్ప‌టి వ‌ర‌కు ఇంచార్జ్ మంత్రిగా ఉన్న హోంమంత్రి మేక‌తోటి సుచ‌రిత‌ను ప‌క్క‌కు పెట్టారు.


దీంతో ఒక్క‌సారిగా.. అస‌లు వైసీపీలో ఏం జ‌రిగింది? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇంచార్జ్ మంత్రులుగా బాధ్య‌త‌లు స్వీక‌రించి ప‌ట్టుమ‌ని ప‌ది నెల‌లు కూడా కాక‌ముందే ఇలా మార్పు చేస్తే.. త‌మ‌కు ప‌ట్టు ఎలా ల‌భిస్తుంద‌ని మంత్రులు స‌హా ప‌లువురు వైసీపీ నాయ‌కులు కూడా చ‌ర్చించుకున్నారు. అయితే, జ‌గ‌న్ తీసుకున్న మ‌ర్మం మాత్రం ఇప్ప‌టికీ చాలా మందికి తెలియ‌డం లేదు.


తాను నియ‌మించిన జిల్లా ఇంచార్జు మంత్రుల‌ను రెండు మూడు నెల‌ల పాటు ఆయ‌న ప‌రిశీలించారు. ఆయా జిల్లాల్లో ప్ర‌తిప‌క్షం టీడీపీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేస్తున్నారా?  లేదా? అనేవిష‌యాన్ని ఆయ‌న అవ‌గ‌తం చేసుకున్నారు. అయితే, ఒక్క గౌతంరెడ్డి మిన‌హా మిగిలిన వారు త‌మ ప‌నుల్లో తాము ఉన్నారే త‌ప్ప‌..జిల్లాపై పెద్ద‌గా ప‌ట్టు సాధించ‌లేక పోయారు. దీంతో ఆయా జిల్లాల్లో టీడీపీ దూకుడు పెరిగింది. మ‌రొకొంద‌రిపై ఆరోప‌ణ‌లు వ చ్చాయి. ఇంచార్జ్ మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ.. త‌మ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని సీనియ‌ర్లు చెప్పుకొచ్చారు. ఇక‌, జూనియ‌ర్ల‌యితే.. త‌మ‌కు అసలు వాల్యూ ఇవ్వ‌డం లేద‌ని తెలిపారు.


పైగా వ‌ర్క్ ప్రెజ‌ర్ కూడా వీరిపై ఎక్కువ‌గా నే ఉంది. ఈ నేప‌థ్యంలో అన్ని విష‌యాల‌ను కూలంక‌షంగా ప‌రిశీలించిన జ‌గ‌న్ నాయ‌కుల సామ‌ర్ధ్యాన్ని ఒడ‌బోసి.. జిల్లాల‌ను కేటాయించార‌ని అంటున్నారు. సీనియ‌ర్లు ఎక్కువ‌గా ఉన్న జిల్లాల్లో ఒక విధంగా జూనియ‌ర్లు, యువ‌త హ‌వా ఎక్కువ‌గా ఉన్న చోట్ల కొంద‌రికి అవ‌కాశం క‌ల్పించారు. మ‌రికొంద‌రిని త‌ప్పించారు. ఇదీ జ‌రిగింది. వైసీపీలో జ‌రిగిన ఇంచార్జ్‌ల మార్పుపై ఇప్ప‌టికీ చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: