నేరస్తులని, నిందితులని జనం ఏరి కోరి నాయకులుగా ఎన్నుకుంటారని మరో సారి రుజువైంది. మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల బరిలో నేరచరితులకు పార్టీల అగ్రతాంబులం ఇచ్చాయి. మహారాష్ట్ర శాసన సభకు కొత్తగా ఎన్నికైన 288 మంది శాసనసభ్యుల్లో 285 మందికి తీవ్ర నేరాల కేసులో నిందితులని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది.


ఈనెల 21న హోరా హోరీగా జరిగిన ఎన్నికల కోసం అభ్యర్థులు తమ నామినేషన్లను తోపాటు సమర్పించిన అఫిడవిట్ ల ఆధారంగా  ఓ నివేదికను రూపొందించి, విడుదల చేసింది. 176 మంది ఎమ్మెల్యేలు తమ పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారని తెలిపింది. గత శాసనసభలోని నేరచరితులు అయిన ఎమ్మెల్యేల తో పోల్చితే ఈ సారి ఐదు శాతం ఎక్కువ మంది పై తీవ్ర నేరారోపణలు ఉన్నట్లు వెల్లడైంది అని పేర్కొంది.


  2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు 165 మంది క్రిమినల్ కేసులు అందులో 115 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఆరోపణలు ఎదుర్కొన్నారు.దీంతో ఈసారి ఎక్కువ మంది నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికయ్యారని తేలిందని పేర్కొంది.   
12 మంది కొత్త ఎమ్మెల్యేల అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడంతో పరిశీలించ లేక పోయినట్లు తెలిపింది. 


బిజెపి ఎమ్మెల్యే లో 40 మంది పైన, శివసేన ఎమ్మెల్యేల్లో 26 మంది పైన, ఎన్.సి.పి ఎమ్మెల్యేలు 15 మంది పైన, 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన, స్వతంత్రులు పైన తీవ్ర నేరాల విచారణ లో ఉన్నట్లు బిఆర్ నివేదిక వెల్లడించింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల సంబంధించి అఫిడవిట్లు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో లేనందున వాటిని విశ్లేషించి లేక పోయినట్లు పేర్కొంది. రద్దయిన అసెంబ్లీలోని 254 మంది ఎమ్మెల్యేలు 88% కోటీశ్వరులు కాగా ప్రస్తుత అసెంబ్లీ ఎమ్మెల్యే 264 మంది అంటే 93 శాతం కోటీశ్వరులు ఉన్నారని తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: