జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ప్రతి నిర్ణయం కూడా మెచ్చుకోదగినదే.  ప్రతి నిర్ణయం వెనుక ఎంతో కసరత్తు ఉంటుంది.  అలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.  తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు అమలు చేస్తున్నారు.  నిర్ణయాలు అమలు జరుగుతుండటంతో ప్రజలు సైతం మెచ్చుకుంటున్నారు.  జగన్ అధికారం చేపట్టిన తరువాత మొదటగా ముసలి అవ్వలకోసం పింఛన్ పధకాన్ని తీసుకొచ్చి.. పింఛన్ ను పెంచారు.  


ఇది వారికి చాలామంచి గుర్తింపు వచ్చింది.  అనంతరం జగన్ నిరుద్యోగుల కోసం గ్రామవాలంటీర్, దాంతో పాటుగా గ్రామసచివాలయ పోస్టులను తీసుకొచ్చింది.  నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించింది.  ఇలా ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం సఫలం అయ్యింది.  ఆ తరువాత పారిశుధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు జీతాలు పెంచి వారికీ జీవితాన్ని ఇచ్చింది. 


దీంతో పాటుగా హోమ్ గార్డుల జీతాలు సైతం పెంచింది జగన్ సర్కార్.  గ్రామవాలంటీర్ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.  ఇంకా ఈ వ్యవస్థలో 25 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.  వీటికోసం ఇటీవలే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు.  వీటితో పాటుగా ఇంకా అనేక పధకాలను కూడా ప్రవేశపెట్టారు. ఇక ఇదిలా ఉంటె, వచ్చే జనవరిలో లక్షలాది పోస్టులకు నోటిఫికేషన్ వెలువడబోతున్నది.  


ఇక ఇదిలా ఉంటె, చాలా కాలంగా ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికల జీతాలు పెంచాలని చాలా కాలంగా అడుగుతున్నారు.  కానీ, గత ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోలేదు.  కాగా, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టింది.  పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  వారి జీతాలను రూ.16 వేలకు పెంచింది.  ఈ నిర్ణయంతో పారిశుధ్య కార్మికుల కళ్ళలో ఆనందం వెల్లివిరిసింది.  దీంతో పాటు ఆరోగ్యశ్రీ పధకాన్ని ఆంధ్రప్రదేశ్ కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లకు ఏపీ ప్రభుత్వం విస్తరించింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: