ఆ ముగ్గురికి భారతరత్న ప్రదానం చేస్తే 124 కోట్ల భారతీయుల మనస్సులను గెలుచుకున్నవారవుతారు. స్వాతంత్ర సమరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని.. కాంగ్రెస్ ఎంపీ మనీష్‌ తివారీ.... ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ స్పందిస్తూ లేఖ రాసారు.


స్వాతంత్య్ర సమరయోధులైన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఇవ్వాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు.  బ్రిటీష్‌ సామ్రాజ్యవాదంపై తిరుగులేని పోరాటం చేసిన ఆనాటి దేశభక్తుల్లో వారు ముగ్గురు స్ఫూర్తి నింపారని.. ఆ పోరాటంలోనే అమరులయ్యారని మనీష్‌ తివారీ గుర్తుచేశారు. బ్రిటీష్ వారితో నిరంతరాయంగా ప్రతిఘటించే ప్రయత్నంలో 1931 మార్చి 23న బలిదానం చేశారు’’ అని తివారీ ఆ లేఖలో పేర్కొన్నారు.


 26 జనవరి, 2020 నాడు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని భావిస్తే ఆ పురస్కారాన్ని భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే వారికి అమరవీరులు అ (షహీద్ -ఈ- ఆజమ్) అన్న పేరుందని, అలాగే చండీగఢ్ విమానాశ్రయానికి ‘షహీద్-ఇ- ఆజమ్ భగత్ సింగ్’ అన్న పేరుందని ఆయన గుర్తు చేశారు. గతంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కూడా భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారతరత్న ఇవ్వాలని కోరారు. మహారాష్ట్రలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి చెందిన వీర్ సావర్కర్, జ్యోతిబాపులేలకు భారతరత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తుందని ప్రధాని మోడీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. సమాజాన్ని ఉద్ధరించిన మహానీయుల పట్ల కూడా కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న వారికి రావడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని చెప్పారు. కాగా, వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇస్తామని ప్రకటించడంపై కాంగ్రెస్, ఎన్సీపీతోపాటు ఎంఐఎం పార్టీలు వ్యతిరేకించాయి. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు కూడా భారతరత్న ఇవ్వండంటూ కేంద్రంపై మండిపడ్డారు అసదుద్దీన్ ఓవైసీ.


మరింత సమాచారం తెలుసుకోండి: