మాములుగా ఎవరైనా మంచి పనిచేస్తే చప్పట్లు కొట్టి అభినందిస్తాం.  లేదంటే భుజం తట్టి ప్రోత్సహిస్తాం.  వందలాది మంది పాల్గొనే సభల్లో, సమావేశాల్లో  ఎవరైనా మంచి పనులు చేస్తే వారిని అభినందిస్తూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి అభినందిస్తారు.  కానీ, ఆ విశ్వవిద్యాలయంలో మాత్రం అలా చేయడం నేరంగా భావిస్తున్నారు.  చప్పట్లు కొడితే అక్కడ నేరం.  శిక్ష అనుభవించాల్సి వస్తుంది.  చప్పట్లు కొంటుంది.. కానీ, దాని నుంచి సౌండ్ బయటకు రాకూడదు.. 


ఇదెక్కడి విడ్డూరం.. ఇదేం విషయం అసలు ఇలా ఎక్కడైనా ఉంటుందా.. అని సందేహిస్తున్నారా.. అక్కడికే వస్తున్నా.. ఆ విశ్వవిద్యాలయం మరేదో కాదు.. ప్రపంచంలో పురాతనమైన, ప్రాముఖ్యత కలిగిన విశ్వవిద్యాలయంగా పేరు తెచ్చుకున్న విశ్వ విద్యాలయం..అదే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం.  అవును నిజమే.  ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చప్పట్లు కొట్టడం నిషేధం.  


ఎందుకంటే, చెప్పులు కొట్టడం వలన చాలామందికి యాంగ్జైటీకి లోనవుతారని, ఫలితంగా గుండె వేగంగా కొట్టుకుంటుందని... బీపీ, హార్ట్ ఎటాక్ వంటివి వస్తాయని, అందుకే అలా చేయడం నిషేదించినట్టు విశ్వ విద్యాలయం పేర్కొన్నది.  అక్కడి అధికారాలు ఈ విషయాన్ని ద్రువీకరిస్తున్నారు.  విశ్వవిదాయలయంలో ఇలాంటి వాటిని నిషేదించినట్టు చెప్పారు.  ఈ యాంగ్జైటీ వలన అనేక మంది మరణించారని, భవిష్యత్తులో అలా జరగకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వవిద్యాలయం పేర్కొన్నది.  


ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం కాబట్టి సరిపోయింది.  అదే ఇండియాలో ఇలాంటి రూల్ తీసుకొచ్చి ఉంటె.. దానిపై పెద్ద రచ్చ చేసేవారు.  రాజకీయం చేసి నానా హంగామా చేసేవారు.  మెడికల్ పరంగా చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే, యూపీలోని విశ్వ విద్యాలయాల్లో ఇటీవలే మొబైల్ ఫోన్స్ ను నిషేదించారు.  మొబైల్ ఫోన్స్ ను తీసుకొని కాలేజీలోకి రాకూడదని ఆదేశాలు జరీ అయ్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: