దీపావళి పర్వదినాన మనందరం ఆనందోత్సహాల మధ్య ధామ్ ధామ్ మని అనిపించే టపాసులను కాల్చుకుంటూ సందడి చేసుకుంటున్నారు. ఓ గుమ్మం వైపు తొంగి చూసినా పగలు రాత్రి అని తేడా లేకుండా దీపావళి వెలుగులను విరజిమ్ముతున్నాయి.దీపావళి పేరిట దేశంలో ప్రత్యేకంగా ఒక  దివాళీ నగర్‌ కూడా ఉంది. ఆ విషయం మీకు తెలుసా. దివాళీ నగర్‌ అనగానే మన దేశంలోని వీధి పేరో, ఊరి పేరో అనుకుంటున్నారా? కాదు, కరీబియన్‌ దీవిలో ఉన్న ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దేశంలోని ఒక ప్రాంతం పేరు. ఇక్కడ 13 లక్షల మంది మన దేశస్థులే. వారందరి కోసం దీపావళిని సెలవు దినంగా ప్రకటించారు. ఇక్కడ 1986 నుంచి దీపావళి సంబరాలు నిర్వహిస్తున్నారు. వారి కోసం ప్రభుత్వం కొంత ప్రాంతాన్ని దివాళీ నగర్‌ పేరుతో ఏర్పాటు చేసింది.


ఏటా పండగ కోసం కోట్ల రూపాయల విరాళాలు కూడా అందుతాయి.అందుకే ఈ పండుగ పర్వదినాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏటా 10వేల కోట్ల రూపాయల బాణసంచా వ్యాపారం జరుగుతోంది. ఏటా సుమారు రూ. 600 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ప్రపంచంలో ఎక్కువ టపాసుల్ని కాల్చే అతి పెద్ద పండగ మన దీపావళే.అలాంటి ఈ దీపావళిని ఒక్కో చోట ఒక్కోలా జరుపుకుంటూ సందడి చేస్తున్నారు. 2000 ఏళ్లక్రితం చైనాలో ఓ వంటవాడు మూడు రకాల పొడులను వేడి చేస్తున్నప్పుడు నిప్పురవ్వ పడి పెద్దగా మెరుపులు చిమ్ముతూ మండిపోయింది. అతడు వాడిన గంధకం, బొగ్గుపొడి, ఒక రకమైన లవణాలను ప్రాచీన చైనీయులు వెదురుబొంగుల్లో కూరి మంటల్లో పడేస్తే 'ఢాంఢాం' అని పేలేది. ఇప్పటికీ టపాసుల తయారీలో ఆ మిశ్రమాన్నే వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాణాసంచా ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం కూడా అదే అన్నమాట. 



అమృత్‌సర్‌ స్వర్ణ దేవాలయం తెలుసుగా? బంగారు పూతతో ధగధగలాడే ఆ ఆలయం దీపావళి నాడు మరింత వెలుగులీనుతుంది. సిక్కులు దీపావళి జరుపుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ సిక్కుల ఆరో గురువైన గురు హర్‌గోవింద్‌ సాహిబ్‌తోపాటు 52 మంది రాజులను ఓసారి చెరసాల్లో బంధిస్తాడు. వారిలో గురువును మాత్రం విడుదల చేయడానికి ఒప్పుకుంటాడు.తనతోపాటు రాజులందర్నీ విడుదల చేస్తేనే బయటకు వెళతానని గురువు పట్టుబడతాడు. దాంతో దీపావళి రోజు అందర్నీ విడుదల చేస్తారు. వాళ్లంతా గోల్డెన్‌ టెంపుల్‌కు వచ్చి వేడుకలు జరుపుకుంటారు. స్వర్ణ దేవాలయం నిర్మాణానికి 1577లో పునాది రాయిని వేసింది దీపావళి రోజునే అన్న విషయం మీకు తెలుసా.. హ్యాపీ దీపావళి. 


మరింత సమాచారం తెలుసుకోండి: