టీడీపీ అధినేత నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అయన తండ్రి యొక్క నమ్మకాని నిలబెట్టుకోలేదు అనే చెప్పాలి . టీడీపీ లో అయన తర్వాత లోకేష్ ని పార్టీ అధ్యక్షుడు  చేయాలి అని చంద్రబాబు గారు అనుకున్నారు కానీ లోకేష్ అనుకున్న  అంత స్థాయిలో పార్టీ పై మరియు రాష్ట్ర రాజకీయాలు మీద అంత పటు సాధించలేక పోయారు .


గత ఎన్నికల్లో తొలిసారి మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలైన నారా లోకేశ్... ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో... నారా లోకేశ్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఐదేళ్ల పాటు ఎదురు చూడకతప్పదని అంతా భావించారు. అయితే టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరతారనే ప్రచారం జోరందుకోవడంతో... మరోసారి లోకేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి

వంశీ వైసీపీలో చేరడం ఖాయమైతే... వైసీపీ పాలసీ ప్రకారం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకతప్పదు. అదే జరిగితే అక్కడ ఉప ఎన్నిక కూడా ఖాయమే.టీడీపీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీ తరపున నారా లోకేశ్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా మొదలైంది. అయితే వైసీపీ అత్యంత బలంగా ఉన్న ప్రస్తుతం సమయంలో జరగబోయే ఉప ఎన్నికల్లో నారా లోకేశ్ పోటీ చేస్తారా ? తనయుడి పొలిటికల్ కెరీర్‌తో చంద్రబాబు అంతటి రిస్క్ చేస్తారా ? అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.


 అయితే ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే ఓటమి చవిచూసిన లోకేశ్‌కు మరోసారి ఓటమి ఎదురైతే పరిస్థితి ఏంటనే చర్చ కూడా సాగుతోంది. గన్నవరంలో ఉప ఎన్నిక వస్తే లోకేశ్ పోటీ చేయకపోయినా... ప్రచారంలో ఆయన కీలక పాత్ర పోషించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: