కొన్నేళ్లుగా అంతర్జాతీయ తీవ్రవాదానికి  అల్‌ఖైదానే చిరునామా. కానీ ఇప్పుడా స్థానాన్ని  ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా  (ఐఎస్‌ఐఎస్) ఆక్రమించి, ప్రపంచ శాంతికి  పక్కలో బల్లెంలా మారింది. అనతికాలం లోనే  ఇంతటి గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం, ఐఎస్‌ఐఎస్ సాగిస్తున్న దారుణ మారణ కాండలే. 


అల్‌ఖైదా పిల్లవేరుగా పుట్టుకొచ్చిన ఈ భూతం  ప్రస్తుతం ఇరాక్, సిరియాలకే పరిమితం కాలేదు  ప్రపంచాన్నే ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలనే  లక్ష్యంతో నెత్తుటి కాండకు తెగబడుతోంది.  బిన్‌ లాడెన్ ప్రోద్బలంతో "అల్‌ఖైదా ఇన్ ఇరాక్‌" గా ఆరంభమైన ఈ వ్యవస్థ క్రమేణా బలీయమైన శక్తిగా రూపొందింది. సిరియా, ఇరాక్ సరిహద్దులతో కూడిన కొంత ప్రాంతాన్ని తమ రాజ్యంగా ప్రకటించుకొంది. ప్రస్తుతం ఈ ఉగ్ర సంస్థ అగ్రనేత అబూ బకర్ అల్ బాగ్దాదీ.


సిరియాలో ఐసిస్‌కు వ్యతిరేకంగా పెద్ద సైనిక చర్య జరిగినట్లుగా సమాచారం. వైట్‌హౌస్‌గానీ, అంతర్జాతీయ మీడియా గానీ ధ్రువీకరించనప్పటికీ అమెరికా అధ్యక్షుడు ఆదివారం ఉదయం ఒక ప్రధాన ప్రకటన చేయనున్నారని వైట్‌హౌస్ శనివారం రాత్రి ప్రకటించింది.


ఈ క్రమంలో భాగంగానే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఉదయం ట్విటర్ ద్వారా స్పందిస్తూ భారీ సంఘటన జరిగిందని అని పేర్కొన్నారు. కాగా విషయం గురించి మాత్రం విశదీకరించలేదు. 'అమెరికన్ ఔట్‌లెట్ న్యూస్‌వీక్' తెలిపిన ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ఐసిస్‌ కు వ్యతిరేకంగా, దాని అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీ లక్ష్యంగా ఆపరేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా వెల్లడించింది. 


అయితే "ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా - ఐఎస్ఐఎస్" అగ్రనేత అబూ బకర్ అల్ బాగ్దాదీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించినట్లు బాగ్దాదీని అమెరికా దళాలు ఆదివారం హతమార్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ట్రంప్ బాగ్దాదీ తనంతట తానే పేల్చుకుని మృతి చెందినట్లు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. భద్రతా దళాలు బాగ్దాదీని వెంబడించిన సమయంలో అతడు ఏడుస్తున్నట్లు గమనించాయని పేర్కొన్నారు. బాగ్దాదీ తన ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మాహుతికి పాల్పడినట్లు ట్రంప్ తెలిపారు.

 

వేలమంది అమాయకులను తన ఉగ్రదాడులతో చంపిన బాగ్దాదీ, చివరి క్షణాల్లో మాత్రం పిరికివాడిగా మరణించినట్లు నేడు  వెల్లడించారు. అమెరికా సేనలు దాడి చేసేలోగానే అఆత్మాహుతికి పాల్పడినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. బాగ్దాదీని మట్టు బెట్టేందుకు కొన్ని వారాల నుంచి నిఘా పెట్టామని, రెండు, మూడు మిషన్స్ ఫెయిల్ అయ్యాక, ఎట్టకేలకు మరో ప్రమాదకర మిషన్ లో అతడు మృతి చెందాడని తెలిపారు. మిషన్ సందర్భంగా అమెరికా వైమానిక సేనలు రష్యా గగనతలంపై నుంచి ఎగిరాయని చెప్పారు.

 

అమెరికాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచే ఆపరేషన్ మొత్తాన్ని వీక్షించినట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. బాగ్దాదీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సిరియన్ కుర్దులు అమెరికాకు ఇచ్చారని చెప్పారు. అమెరికా ఆపరేషన్ కు సహకరించిన రష్యా, సిరియా, ఇరాక్ లకు డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

 

అమెరికా దాడిలో ఆత్మాహుతి చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీ ఆచూకీని ఓ ఉగ్రవాది భార్య చెప్పినట్లు తెలుస్తోంది. నిస్రిన్ అసద్ ఇబ్రహీం (29) ఇచ్చిన సమాచారం ఆధారంగా బగ్దాదీ స్థావరాలను అమెరికా నేతృత్వం లోని దళాలు గుర్తించగలిగాయి.

 

నిస్రిన్ ఇబ్రహీం భర్త ఐసిస్‌లో కీలక ఉగ్రవాది. 2015 మేలో తూర్పు సిరియాలోని అల్-ఒమర్ చమురు క్షేత్రంపై జరిగిన దాడిలో అతను మరణించాడు. ఆ సమయంలో నిస్రిన్‌ను అరెస్ట్ చేశారు. ఆమె అమెరికాకు చెందిన నిఘా సంస్థ సీఐఏ, కుర్దిష్ ఇంటెలిజెన్స్ సంస్థలకు సహాయపడేందుకు అంగీకరించారు. బగ్దాదీ స్థావరాలు, నెట్‌వర్క్‌ల గురించి ఆమె చాలా విలువైన సమాచారం అందించారు. ఆమె 2016 ఫిబ్రవరిలో ఇరాక్‌లోని మోసుల్‌లో బగ్దాదీ ఇంటిని గుర్తుపట్టి, సమాచారం అందించారు. అయితే అప్పట్లో అమెరికా వైమానిక దాడులకు ఆదేశాలు ఇవ్వలేదు.

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. సిరియాలో అమెరికా దళాల నేతృత్వంలో జరిగిన దాడిలో ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీ హతమైనట్లు ప్రకటించారు. బగ్దాదీ తన ముగ్గురు పిల్లలతో సహా పేలుడు పదార్థాలు నింపిన పట్టాను పేల్చుకుని మరణించినట్లు తెలిపారు. బగ్దాదీ పిరికిపంద అని అభివర్ణించారు. అమెరికా దళాలు దాడి చేసినపుడు, బగ్దాదీ సొరంగం చివరికి పారిపోయాడన్నారు. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్‌లో ఈ దాడి జరిగినట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: