నాకు అండగా ఉంటానన్నందుకు టిడిపి అధినేత చందరబాబుకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కృతజ్ఞతలు తెలిపారు. తెలిసో తెలియకో ఎక్కడైనా నా పరిధిదాటి ప్రవర్తిస్తే మన్నిస్తారని ఆశిస్తున్నా’’ అని సామాజిక మాధ్యమం వేదికగా వల్లభనేని వంశీ రెండోసారి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు.తాను రాసిన లేఖపై స్పందించినందుకుగానూ తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు  కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో తన సేవల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. నా ఆవేదనను అర్థం చేసుకొని లేఖ రాసినందుకు కృతజ్ఞతలు అన్నారు. 
ఎలాంటి దాపరికాలు లేకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని మీ(చంద్రబాబు) ముందుంచాను. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా 2006 నుంచి మీరు చెప్పిన విధంగా, మీ మార్గదర్శకంలోనే నడిచాను.



మీ ఆదేశానుసారం తొలిసారి విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేశాను. కానీ, ఓడిపోయాను. అలా ఐదేళ్ల విలువైన కాలం వృథా అయ్యిందని ఏనాడు బాధపడలేదు. ఓ సీనియర్‌ నేతపై, ఐపీఎస్‌ అధికారిపై, ఇలా ఎన్నోసార్లు నా పోరాటం సాగింది.  అప్రాజాస్వామిక విధానాలపై నా పోరాటం ఎప్పుడూ ఆపలేదు. 2019 ఎన్నికల్లో నన్ను ఆపేందుకు ప్రత్యర్థులు ఎలాంటి ఒత్తిడి తెచ్చారో మీకు తెలుసు. విషయాన్ని ఇంకా పొడిగించి భిన్నాభిప్రాయాలకు తావివ్వడం నాకు ఇష్టం లేదన్నారు. అంతకు ముందు తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు వంశీ లేఖ రాసిన విషయం తెలిసిందే. 



స్థానిక వైకాపా నాయకులు, కొంత మంది ప్రభుత్వం అధికారుల వల్ల తన అనుచరులు, మద్దతుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారని పేర్కొన్నారు. వారి ఇబ్బందుల్ని తొలగించడానికే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని తెలిపారు. వంశీ లేఖపై చంద్రబాబు స్పందించారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని.. ఈ క్రమంలో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ఎప్పటికీ అండగా ఉంటామని వంశీకి హామీ ఇచ్చారు. తన లేఖపై స్పందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తాజాగా వంశీ మరో లేఖ రాశారు. ఇదిలా ఉండగా  గన్నవరం నియోజకవర్గం రాజకీయ పరిణామాలు... ఎమ్మెల్యే  వంశీ రాజీనామా...29 వైసీపీలో కి వస్తారని ప్రచారం...పొలిటికల్ హిట్ పెంచుతు న్నాయి. ఏ నేపథ్యంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డితో వైసీపీ గన్నవరం ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: