హైదరాబాద్ లేదా భాగ్యనగరం వజ్రాలగని మాత్రమే కాదు. దేశ రాజధాని కాదగిన స్థానంలో విలసిల్లుతుంది. సువిశాల భారతావనికి ఉత్తరాన డిల్లీ లేదా చారిత్రాత్మక హస్తిన విలసిల్లుతున్నట్లే దక్షిణాదిన అద్భుత రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక లక్షణాలున్న భాగ్యనగరిని దేశానికి రెండో రాజధానిగా చేయవలసిన అగత్యం అవసరం ఎంతో ఉంది. చూడ చక్కని సహస్రాబ్ధాల చరిత్రతో, శతాబ్ధాల చారిత్రాత్మక భవనాలతో విలసిల్లే "ఈ భువనం" పారిశ్రామికంగా, వ్యవసాయికంగా, ఆర్ధికంగా కేంద్ర స్థానంలో ఉంటూ దేశానికే వన్నె తెస్తుంది. 

ఇక్కడి భవనాలేన్నో జాతి వారసత్వ సంపదగా (హేరిటేజ్) చేత గుర్తించ బడ్దాయి. ఇక్రిశాట్ లాంటి అనేక అంతర్జాతీయ సంస్థలకు, దేశ రక్షణకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత ఉన్న పరిశోధన అభివృద్ది సంస్థలు ఎన్నో ఇక్కడ నేలకొని జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత సంతరించుకున్న ఈ నగరం నిజంగా భాగ్య నగరమే. దీనికితోడుగా "నిను వీడని నీడను నేను" అంటూ జంటగా సికిందరాబాద్ ఇప్పటికే 'రాష్ట్రపతి విడిది' గా రాష్ట్రపతి భవన్ నెలకొనగా, ప్రతియేటా రాష్ట్రపతికి ఆతిధ్యమిస్తూ ప్రఖ్యాతి గాంచింది.

ఇలాంటి నగరం తెలుగువారి సువిశాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉన్నప్పటి మౌలిక సదుపాయాలు ఎన్నో ఉండగా - ఇప్పుడు దురాశావాదులు, స్వార్ధం తప్ప నిర్మాణాత్మక వ్యూహాలు లేని పాలకుల దోపిడీకి నిలయంగా మారింది. ఇంతటి మాహానగరం తనఖ్యాతి కోల్పోరాదన్న కోరిక ఉభయ రాష్ట్రాల తెలుగువారిలోనే కాదు దేశప్రజల మనసుల్లో కూడా విస్తృతంగా నెలకొని ఉంది. కారణం ఈ నగరం ఉత్తర దక్షిణ భారత సాంస్కృతిక వారధి కావటమే. 

దాదాపు రాష్ట్ర విభజన తరవాత ఈ నగరం ఎందుకో జవ జీవాల్ని కోల్పోతూ - ఫేడ్ అవుట్ అవుతూ వస్తుంది. రహదార్లు, మురుగు నీటి పారుదల, త్రాగు నీటి సరపరా మొదలైన సదు పాయాలు సరైన క్రమబద్దీకరణ లేకుండా అభివృద్ధికి నోచుకోకపోగా క్రమంగా ప్రఖ్యాత చారిత్రాత్మక హేరిటేజ్ భవనాలను కూల్చివేసే దుర్మార్గపు ఆలోచనలతో ఇక్కడి పాలకులు మునిగిపోయి ఉన్నారు. అధికార పార్టీ దృష్టి కోణంలో ఈ నగరం బంగారు బాతుగుడ్డు. ఎంతైతే అంత ఎక్కడ దొరికితే అక్కడ భూ కబ్జాలు నిరాటంకంగా జరిగిపోతున్నాయి. 

అందుకే ఈ నగరాన్ని "కేంద్ర పాలిత ప్రాంతం" గా మార్చి దేశానికే తలమానికం కాగల లక్షణాలున్న "విశ్వనగరం" చేయటం చాలా అవసరం. దీనికి సరైన మార్గం దేశానికి రెండవ రాజధాని చేయటం ఇంకా ఉత్తమం. ప్రాతీయ పాలన ఇక్కడ ఈ నగరాన్ని "భారత చారిత్రాత్మక అవసరం" ఆధారంగా జరగాల్సిన అభివృద్ధిని అడ్డుకున్నట్లే కనిపిస్తుంది.
                 
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితం తరవాత అభివృద్ది నిరోధక, ఒక కుటుమబం హస్తగతమైన  అధికార టీఆరెస్, తనలో సడలిపోతున్న ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ సమీకరించుకొంటున్న తరుణంలో “కేసీఆర్ కు - నీ కాల్మొక్కుత బంచన్ దొర - అనే అనుయాయులతో నిండిన నిరంకుశ టీఆరెస్‌” అహంభావం తగ్గించటానికైనా హైదరాబాద్‌ ను యూటీ చేసి – జాతీయ ఐఖ్యత సాధించే సరైన అవకాశాన్ని కేంద్రంలోని బీజేపీ వదులుకోరాదు. ఖాలయాపన చేయకుండా బిజేపి తను మనసులో అనుకుంటున్నట్లుగా హైదరాబాద్ను “విశ్వనగరం” చేయటం తక్షణ అవసరం.   

డిసెంబరు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించినా తరువాత లోక్ సభ ఎన్నికల్లో “టీఆరెస్” బొక్క బోర్లా పడింది. దీంతో టీఆరెస్‌ను అణగ దొక్కడం పెద్ద కష్టమేమీ కాదని తొలుత బీజేపీ భావించింది.  కానీ, తాజాగా హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో మళ్లీ టీఆరెస్‌ అనుకూల వాతావరణం నెలకొంటున్నట్లుగా కనిపిస్తుంది. గతంలో ఇలాటి ఆత్మ విశ్వాసమే నంద్యాల ఉపఎన్నికలో పొందిన ఏపిలోని టిడిపి – తరవాతి కాలంలో సర్వ వినాశనం అందిపుచ్చుకుంది. అదే పరిస్థితిని  హుజూర్‌నగర్‌ విజయంతో తెలంగాణాలో లో కేసీఆర్ ప్రభుత్వం రుచిచూస్తుంది. ఆనుమానం లేదు. టీఅరెస్ భవిష్యత్ ప్రస్పుటంగా కనిపిస్తూనే ఉంది. 

కేసీఆర్ ప్రగతిభవన్ గడపదాటి కనీసం సచివాలయం ముఖం చూడకపోయినా ప్రచారానికి వెళ్లకపోయినా, టిఎస్-ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనుకున్నా, అది కాంగ్రెస్ సిటింగ్ స్థానమైనా కూడా అసమర్ధ ప్రతిపక్షాల కారణంగా టీఆరెస్ దిగ్విజయం సాధించింది. కేసీఆర్ మేజిక్ ఇంకా కొనసాగుతోందన్న విషయం స్పష్టమైంది. 

హైదరాబాద్ అభివృద్ధి అడ్దుకునే ఏకైక శక్తి కేసీఆర్‌ ను ఆయన కుటుంబ నియంతృత్వాన్ని వ్యతిరేఖించే శక్తులన్నింటిన్ని  ఏకంచేసే శక్తి ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి లేదు అనటంలో సందేహం లేదు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా బీజేపీ పెద్ద ప్రణాళికే రచించినట్లు తెలుస్తోంది. తెలంగాణకు హైదరాబాద ప్రాణాధారం మాత్రమే కాదు కేసీఆర్ ప్రభుత్వానికి పెద్ద ఆదాయవనరు రాష్ట్ర ఆదాయంలో 80 శాతం అక్కడి నుంచే వస్తోంది. ఉపాధికి ఉద్యోగాలకు ఇది రాజధాని. అలాంటి హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. నిరుద్యోగం రేటు ఎక్కువవుతుంది. అంతేకాదు. కేసీఆర్‌కు రాజకీయంగానూ ఉన్న ఉడుంపట్టు సడలిపోతుంది. 

రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర పెట్టుబడిదారులు అందరికీ హైదరాబాదే ప్రధాన కేంద్రం. వారి వ్యాపారాలు పరిశ్రమలు  ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్న సందర్భాలే ఎక్కువ. వాటిని అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం వారిని తన ఉక్కు పిడికిలిలో పెట్టుకోగలుగుతున్నారు. తెలంగాణా ఏర్పాటు సమయంలో సైతం మీడియాతో మొదలైన అరాచకవాదం రాష్ట్రంలో ఎల్లెడలా విస్తరించిందని అంటున్నారు.

మొన్నటి ఏపీ ఎన్నికల్లో కేసీఆర్ ఈ పవర్‌ను అడ్డుపెట్టుకునే ఏపీ ఎన్నికలను ప్రభావితం చేశారని, టిడీపీ మద్దతుదారుల వాదన. వ్యాపారులను పారిశ్రామికవేత్తను నిరంతరం బెదిరించి ఆరోపణలున్నాయి. హైదరాబాద్ అభివృద్ది కావాలంటే పాలకుల నియంతృత్వం ఏమాత్రం ఉండకూడదు, కాని పాలనాపర నియంత్రణ నిరంతరం ఉండాలి. హైదరాబాదును యూటీ చేస్తేనైనా 'కేసీఆర్ నియంతృత్వ ఉడుంపట్టు' అయినా సడలి పోతుంది.

అదే సమయంలో అతి పురాతన సాంప్రదాయక రాజకీయ రాజధానిహైదరాబాద్‌ను కోల్పోయి, మరో ప్రాంతీయ పార్టీ టిడిపి అవినీతి అక్రమ అసమర్ధ సామాజికవర్గ  ఐదేళ్ళ పాలనలో కనీసం రాజధానిని నిర్మించుకోలేకపోయిన వేదనలో ఉన్న ఏపీ ప్రజలు కూడా హైదరాబాద్‌ ను యూటీ చేస్తే నైనా కొంత సంతోషిస్తారు. నిజానికి తొలి నుండీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఏపీలో చాలామంది కోరేదదే.  ఇలాంటి సమయంలో హైదరాబాదును యూటీ చేస్తే ఏపీ లోనూ బీజేపీ పట్ల సానుకూలత సాధ్యమౌతుంది. ఇక్కడ స్వార్ధపరత్వమే ధ్యేయంగా, కుల రాజకీయాలే ప్రాధాన్యంగా బ్రతికే రెండు నుండి నాలుగైదు కులాల దుర్మార్గం ధౌష్ట్యం ఇతరులపై తగ్గే అవకాశాలు మెరుగు పడతాయి. 

అయితే ఈ అంశాలన్నీ ఇప్పటికే కేంద్రం పరిశీలనలో ఉన్నాయని, హైదరాబాద్‌ను యూటీ చేస్తే బీజేపీకి రాజకీయంగా కలిసి రావటమే కాకుండా – హైదరాబాడ్ కేంద్రంగా దక్షిణ భారత రాజకీయాలు దేశాభివృద్ధికి సానుకూలత సిద్ధిస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: