కొత్త చట్టాలు చేసినప్పటికి కశ్మిర్ లో పరిస్థితి లో ఏ మాత్రం మార్పు రావట్లేదు.పాక్ ఎప్పటికప్పుడు కాశ్మీర్ పై ఎదో విధంగా విషం చిమ్ముతూనే ఉంది.జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఆంక్షలు విధించిన కేంద్రం ఇటీవల సడలించింది. దీంతో ఉగ్రమూకలు దాడులకు తెగబడుతున్నాయి. దేశమంతా దీపావళి సంబరాలు   జరుపుకుంటున్న వేళ ఆదివారం శ్రీనగర్‌ లోని సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్‌ దాడిలో ఆరుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు గాయపడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో మరోసారి గ్రనేడ్‌ దాడి జరిగింది. సోపోర్లోని బస్స్టాండ్ సమీపంలో గ్రనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో 20 మంది పౌరులు గాయపడ్డారు. ఇందులో ఆరుగురు  తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఇప్పటికే భారత  సైన్యం ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకుంది.  సైన్యం కూడా ఉగ్రవాదుల దాడులను తిప్పికొడుతోంది.ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులు  ప్రస్తుతం శ్రీనగర్లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.   

ఘటన అనంతరం.. అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని నిర్బంధించి సోదాలు నిర్వహిస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు జరిపిన రెండో దాడి ఇది. ఈనెల 26న శ్రీనగర్‌లోని కరన్‌ నగర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్‌ దాడిలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు.ఈయూ ఎంపీల బృందం కశ్మీర్ను సందర్శించనున్న ఒకరోజు ముందు ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.యూరోపియన్‌ యూనియన్‌ కు చెందిన ప్రతినిధుల బృందం జమ్మూకశ్మీర్‌ పర్యటనకు ఒక్క రోజు ముందు ఈ దాడి జరగడం పలు అనుమానాలకి తావిస్తోంది. 


వారి పర్యటన జరిగే అంశంపై అనుమానాలు నెలకొన్నాయి. అటు ప్రధాని మోదీతో ఐరోపా సమాఖ్య ఎంపీలు భేటీ అయ్యారు. ఎంపీల బృందం చేపట్టిన కశ్మీర్ పర్యటన విజయవంతమవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు భారత ప్రధాని. కశ్మీర్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందన్నారు. ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: