అక్టోబర్ 24 వ తేదీకి ముందు వచ్చిన సర్వే ఫలితాలను బట్టి బీజేపీ ధీమాను వ్యక్తం చేసింది.  ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ కనీసం 130 స్థానాల్లో గెలుస్తుందని, శివసేన మద్దతుతో ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేస్తుందని వార్తలు వచ్చాయి.  కానీ, ఎన్నికలకు వచ్చే సరికి పూర్తిగా రివర్స్ అయ్యింది.  ఎన్నికల్లో బీజేపీకి కేవలం 105 స్థానాలు మాత్రమే దక్కించుకుంది.  ఇప్పుడు మరో ముగ్గురు బీజేపీకి సపోర్ట్ చేశారు.  ఫలితంగా బీజేపీ బలం 108 కి పెరిగింది.  ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే కనీసం మెజారిటీ 144 ఉండాలి.  అంటే ఇంకా 36 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి.  


సపోర్ట్ అవసరం కాబట్టి శివసేన ఇప్పుడు డిమాండ్ చేస్తోంది.  ముఖ్యమంత్రి పదవి తమకు కావాలని పట్టుబడుతోంది. కానీ, బీజేపీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది.  ముఖ్యమంత్రి పదవి చెరిసగం అంటేనే మద్దతు ఇస్తామని లేదంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని అంటోంది.  శివసేన బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తుండటంతో బీజేపీ ఆలోచనలో పడింది.  రెండు పార్టీల మధ్య ఎలా సయోధ్య కుదర్చాలో తెలియక బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.  


అసలు శివసేనతో పొత్తు పెట్టుకోకుండా డైరెక్ట్ గా పోటీ చేసి ఉంటె కనీసం 130 స్థానాల్లో అయినా విజయం సాధించేవాళ్ళు అని అంటున్నారు.  శివసేన కూడా ఒంటరిగా పోటీ చేసి ఉంటె గతంలో మాదిరిగానే 60 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తోంది.  రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం వలన ఇబ్బంది వచ్చిపడింది.  ఈ రెండు కలిసి పోటీ చేయడం వలన.. కొన్ని స్థానాల్లో బీజేపీ నాయకులు రెబల్స్ గా మరి పార్టీ సీట్లు తక్కువగా గెలుచుకోవడానికి కారణం అయ్యారు.  


అయితే, ఇప్పుడు రెండు పార్టీలు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే తాము చేస్తామని అంటున్నారు.  ఈరోజు రెండు పార్టీల నేతలు గవర్నర్ ను కలిసారు.  ఇలా గవర్నర్ ను కలవడం వెనుక కారణం ఏంటి అన్నది తెలియడం లేదు.  రెండు పార్టీలు ప్లాన్ గా వెళ్తున్నాయి.  అయితే, మహారాష్ట్రలో తప్పకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ నేత జీవీఎల్ అంటున్నాడు.  బీజేపీ ఏ ధీమాతో ఉన్నదో తెలియడం లేదు.  శివసేన కలిసి వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ కూడా చెప్తున్నది.  మరి ఏం జరుగుతుందో చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: