సమస్య ఎదురైనపుడు పరిష్కారం కనుగొనాలి...... కానీ సమస్య ఎదురైనా ప్రతి సారి ప్రాణమే సమాధానంగా వదులుకోవాల్సి వస్తుంది. బోరు బావి ఘటనలు ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి.  ఇప్పటికి బోరు బావిలో బాలుడు పడి ఇప్పటికి 64 గంటలు అవుతోంది.
తమిళనాడులోని తిరుచ్చిలో ఆడుకుంటు ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన సుజిత్‌ ను రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు.


పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం తీవ్రంగా శ్రమిస్తున్నారు.  ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీఎం పలనస్వామికి ఫోన్‌ చేసి సహాయ చర్యలపై వాకాబు చేశారు.  ఆ చిన్నారి ఎలాంటి ఆపద వాటిల్లకుండా క్షేమంగా బయటపడాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని మోడీ ట్విట్టర్ ద్వారా ప్రార్థించారు.  చిన్నారిని బయటికి తీసుకువచ్చేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ అంశంపై తమిళనాడు సీఎం పళనిస్వామితో కూడా  చర్చించానని పేర్కోన్నారు.ఘటనా స్థలాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పరిశీలించారు. 


ప్రస్తుతం బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడని తెలిపారు సీఎం. బాలుడికి నిరంతరం బాలుడుకి ఆక్సిజన్ అందిస్తున్నట్లు మరింత లోపలికి వెళ్లకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.  సుజిత్ పడిపోయిన బోరుబావికి సమాంతరంగా 40 అడుగుల మేర గుంత తవ్వారు.
"మొదట బాలుడి చేతులు పైకి కనిపించడంతో, వాటిని తాళ్లతో కట్టి, పైకి లాగాలని ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు కానీ, కుదరలేదు.సుజిత్ రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఉన్నాడు.  బాబు పడిపోయిన ప్రాంతం పూర్తిగా రాతి ప్రాంతం కావడంతో తవ్వడానికి ఇబ్బందులు తలెత్తాయి. 


దీంతో కొత్త డ్రిల్లింగ్ మెషిన్‌ను తెప్పించి తవ్వకం మొదలుపెట్టారు. "సహాయ కార్యక్రమాలను ఆపివేయడం ఉండదు. వర్షం వచ్చినా అవి కొనసాగుతాయి. ఇప్పుడు సుజిత్ 88 అడుగుల లోతులో ఉన్నాడు. ఇప్పటివరకూ 40 అడుగులు తవ్వాం. ఇదే వేగంతో తను ఉన్న పాయింట్  వరకూ తవ్వాలంటే మరో 12 గంటలు పడుతుంది" అని రెవెన్యూ శాఖ కమిషనర్ రాధాకృష్ణన్ సోమవారం మీడియాకు చెప్పారు. అధికారులతోపాటు దేశ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా సుజిత్ బోరుబావి నుంచి క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: