గత 24 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.  ఈ సమ్మెకు అసలు కారణం ఏంటి అనే విషయం ఇప్పుడు పక్కన పడింది.  లేనిపోని కారణాలని బయటకు వస్తున్నాయి.  ఆర్టీసీని విలీనం చేయాలన్నది కార్మికుల ప్రధాన డిమాండ్. అయితే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం అవుతుందా అనే విషయం గురించి చాలా లోతుగా ఆలోచించాలి.  ఇదేదో నోటిమాటగా విలీనం చెయ్యొచ్చు.. విలీనం చేస్తున్నాం అని చెప్తే కుదరని పని.  


కార్పొరేషన్ సంస్థను ఒకేసారి ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే.. దానికి సంబంధించిన ఎన్నో అంశాలపై తదనంతర కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  వేలాది మంది కార్మికులు ఉంటారు.  మిగతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికి జీతాలు ఇవ్వాలి.  ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే అన్ని కల్పించాలి.  సరే కల్పిస్తారు.. ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తే.. దాని వలన ప్రభుత్వానికి నిత్యం వేలకోట్ల రూపాయల నష్టం వస్తుంది.  


ఆర్టీసీ అన్నది ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిస్తేనే సక్రమంగా నడుస్తుంది.  కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఆర్టీసీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు అంటే కారణమా ఇదే.  ఇకపోతే, ఈరోజు హైకోర్టులో జరిగిన వాదనల్లో చాలా సమాచారం బయటకు వచ్చింది.  రాయితీలు, బస్ పాసుల కారణంగా ఆర్టీసీకి రోజుకు 2.3 కోట్ల రూపాయల నష్టం వస్తున్నట్టు కార్మిక సంఘాలు అంటున్నాయి.  అంటే నెలకు 80 కోట్లకు పైగా నష్టం వస్తోంది.  మరి నష్టం వస్తున్నప్పుడు కార్మికులు సమ్మె ఎలా చేస్తారు.  నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాటలోకి తీసుకొచ్చి డిమాండ్లు నెరవేర్చమని అడిగితె ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది.  అయితే, కార్మికులు అడుగుతున్న డిమాండ్లలో 4 డిమాండ్లు కూడా ప్రభుత్వం నెరవేర్చలేదా అని ప్రశ్నించింది.  


నాలుగు డిమాండ్లకు రూ. 50 కోట్లు ఖర్చు అవుతుంది.  అదికూడా ప్రభుత్వం ఇవ్వలేదా అని అడిగితె లేదని సమాధానం రావడంతో హైకోర్టు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసింది.  అక్కడితో ఆగిపోలేదు.  రీయింబర్సమెంట్, జీహెచ్ఎంసి బకాయిలు దాదాపుగా రూ. 4,967 కోట్లు ఉన్నాయని కార్మికులు హైకోర్టుకు చెప్పడంతో దానిపై కోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించగా పరిశీలించి చెప్తానని అన్నారు.  చూస్తుంటే.. ఆర్టీసీ నుంచి చాలా  బయటపడేలా ఉన్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: