భారతీయ సంప్రదాయాలన్న, సాంప్రదాయ క్రీడాలన్నా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఎక్కువ. మొన్నటికి మొన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులోని మహాబలిపురాన్ని సందర్శించారు.  ఈసారి సంక్రాంతికి జరిగే జల్లికట్టు చూసేందుకు ఓ ప్రపంచాధినేత, ఓ అగ్రరాజ్యాధినేత వస్తున్నారన్న కథనాలు తమిళనాడునిపుడు కుదిపేస్తున్నాయి.  తమిళనాడు ప్రజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించే జల్లికట్టును చూసేందుకు అగ్రరాజ్యం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాబోతున్నట్లు తెలుస్తోంది. 


మధురై జిల్లా పాలనా యంత్రాంగంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పుతిన్ 2020 జనవరిలో తమిళనాడులోని అలంగనలూర్‌లో పొంగల్ ఉత్సవాల సందర్భంగా జరిగే జల్లికట్టును వీక్షిస్తారు. ఈమేరకు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందింనట్లు తెలుస్తుంది. 
పుతిన్‌తోపాటు ఈ ఉత్సవాలను చూసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా వస్తున్నట్లు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు.మధురై సమీపంలోని అలంగనలూర్‌లో జరిగే జల్లికట్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. 


‘జల్లి’ అంటే చిల్లర నాణేలు,  ‘కట్టు’ అంటే కట్టడం.... అంటే ఎద్దుల కొమ్ములకు చిల్లర నాణేలు ఓ సంచిలో కట్టి.. వాటిని పట్టుకోవడం అనేది ఈ ఆటలో ప్రధాన అంశం.  ఇది  క్రమక్రమంగా రూపాంతరం చెంది.... ఆటగాళ్లు ఎద్దులను వదిలిపెట్టి.. వాటి మోపురాలను పట్టుకుని ఎంత ఎక్కువసేపు అలా పట్టుకుని వేలాడేవారిని వీరులుగా పరిగణిస్తూ ఉంటారు. వేలాది మంది ప్రత్యక్షంగా వీక్షిస్తుండగా ఎద్దులతో ఈ క్రీడను నిర్వహిస్తారు. 


జల్లికట్టు పేరుతో ఎద్దులను హింసిస్తున్నారంటూ జంతు ప్రేమికులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఆ ఆటను నిషేధించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు 2016లో ఆదేశించింది. దీని మీద తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. చెన్నై మెరీనా బీచ్‌తో పాటు.... మిగిలిన ప్రాంతాల్లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి ప్రభుత్వం జల్లికట్టు యధావిధిగా జరుపుకొనేందుకు అనుమతిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తీసుకొచ్చింది.  అయితే ఈ సారి అగ్రరాజ్యాధినేత రానుండడం.. ప్రధాన మోదీ స్వయంగా వీక్షించేందుకు ఉత్సాహం చూపుతుండడంతో జల్లికట్టు క్రీడ యావత్ ప్రపంచం దృష్టికీ వెళ్ళనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: