వైఎస్ జగన్ అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు స్కూళ్లకు శాపంగా మారేలా కనిపిస్తోంది. ఇప్పటికే అమ్మఒడి వంటి పథకాల కారణంగా గవర్నమెంట్ స్కూళ్లుకు గిరాకీ పెరిగిపోయింది. జనం తమ పిల్లలను ప్రైవేటు బళ్లలో మానేయించి ప్రభుత్వ స్కూళ్లకు పంపే రోజులు వచ్చాయి. ఇక ఇప్పుడు జగన్ ప్రైవేటు స్కూళ్లపై మరో బాంబు వేశారు.


అదేంటంటే.. వచ్చే ఏడాది నుంచి గవర్నమెంట్ స్కూళ్లలోనూ ఒకటో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం.. ఆ తరువాత ఏడాది 9వ తరగతి, మరుసటి ఏడాది పదో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం తరగతులు నిర్వహిస్తారు.


జనం ఇంగ్లీష్ మీడియం కారణగానే చాలా వరకూ ప్రైవేటు స్కూళ్లవైపు చూస్తున్నారు. తాము పెద్దగా చదవుకోక పోయినా తమ పిల్లలు ఇంగ్లీషు చదువులు చదవాలని ఆశ పడుతున్నారు. అందుకే వేలకు వేలు ఖర్చయినా పరవాలేదని ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. కానీ అక్కడ సీన్ వేరేలా ఉంటోంది. ప్రభుత్వ స్కూళ్లలో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటుంటే.. ప్రైవేటు పాఠశాలల్లో నెలకు 10 వేలు ఇచ్చి టీచర్లను పెట్టుకుని ఆర్భాటంతో స్కూళ్లు నడుపుతున్నారు.


దీంతో ఓవైపు ప్రజల జేబుకు చిల్లులు పడుతుంటే.. పిల్లలకు మాత్రం అంతగా చదువు రావడం లేదు. ఇప్పుడు జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మరోసారి ప్రభుత్వ స్కూళ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది. అంతే కాదు.. నవంబర్‌ 2 నుంచి వైయస్‌ఆర్‌ కంటి వెలుగు రెండో విడత ప్రారంభం కానుంది. తొలి విడతలో 69.03 లక్షల మంది పిల్లల్లో 65.03 లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు .


ఇందులో 4.3 లక్షల మంది పిల్లలు కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ స్కూల్స్‌ ప్రాంగణాల్లోనే రెండో విడత కంటి వెలుగు ప్రారంభం కానుంది. పిల్లలకు స్క్రీనింగ్‌ చేసి కంటి అద్దాలు అందజేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: