ఆయ‌న డిప్యూటీ సీఎంగా ప‌నిచేసిన నేత‌. సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ప‌నిచేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ప‌నిచేస్తున్న‌ప్పుడు అవినీతి ఆరోప‌ణ‌ల‌తో త‌న ప‌ద‌వికి ఎస‌రు తెచ్చుకున్నారు.  అవినీతి అక్ర‌మాల‌తో అత‌న్ని డిప్యూటీ సీఎం పోస్టు నుంచి తీసేసిన‌ట్లుగా పైకి ప్ర‌చారం చేసినా, వాస్త‌వంగా ఎందుకు ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించారో లోకం కోడై కూస్తూనే ఉంది. సీఎం త‌రువాత సీఎం అంత‌టి పోస్టులో ఉంటూ తాను చేసిన చేసిన చిన్న త‌ప్పిదం త‌న ప‌ద‌వికి ఎస‌రు తెచ్చింది. దాంతో త‌న ప‌ద‌విని త్య‌జించాల్సి వ‌చ్చింది. అయితే మొన్న‌టి కాబినేట్ విస్త‌ర‌ణ‌లో త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించారు.


డిప్యూటీ సీఎంగా ఆయ‌న చేసిన కంపు ప‌నితో సీఎం అవ‌కాశం ఇవ్వ‌కుండానే ప‌క్క‌న పెట్టేశారు. దీంతో అస‌హానంతో సీఎంను ఇరుకున పెట్టాల‌ని ప్ర‌య‌త్నించి, తానే గోతిలో ప‌డ్డారు. ఆయ‌న మీడియా స‌మావేశంలో సీఎం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించి సీఎం ఆగ్ర‌హానికి గురై.. వెంట‌నే న‌ష్ట నివార‌ణ‌గా అదే మీడియాలో మాట‌మార్చి సీఎంను పొగ‌డ్త‌ల‌తో ముంచేత్తారు. ఇక త‌నను డిప్యూటీ సీఎంగా తొల‌గించ‌డాన్ని, త‌దుప‌రి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంతో మ‌న‌స్థాపం చెందిన ఆయ‌న సీఎంను ఇరుకున పెట్టేందుకు సిద్ద‌మైన‌ట్లు ఆయ‌న చేస్తున్న వ్యాఖ్యాల‌తో అర్థం అవుతుంది.


ఇప్పుడు అదే మాజీ డిప్యూటీ సీఎం సీఎంకు ఎస‌రు పెట్టే ప‌నికి పూనుకున్నారా..?  అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. సీఎం అనేక బ‌హిరంగ స‌భ‌ల‌ల్లో చేసిన వాగ్ధానాన్ని వ‌క్రీక‌రించి అభాసు పాలు చేసేందుకుందుకు ఆ డిప్యూటీ సీఎం ప‌న్నాగం ప‌న్నాడా..?  అంటే అవున‌నే అనిపిస్తున్నాయి ఆ మాజీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యాలే నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి.. ఇంత‌కు సీఎం ఎవ‌రు.. మాజీ డిప్యూటీ సీఎం ఎవ‌రు అనే క‌దా మీ డౌట్‌.. ఇప్ప‌టికి మీకు అర్థ‌మ‌య్యే ఉంటుంది.. ఈ సీఎం కేసీఆర్ అని, మాజీ డిప్యూటీ సీఎం డాక్ట‌ర్ తాటికొండ రాజయ్య అని. ఇంత‌కు స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం డాక్ట‌ర్ రాజ‌య్య చేసిన వ్యాఖ్యాలు ఏంటో చూస్తే కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఉన్నాయంటే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క‌మాన‌దు.


ఇంత‌కు రాజ‌య్య చేసిన వ్యాఖ్యాలు చూద్దాం. దళితులందరికి మూడెకరాల భూమి ఇస్తామని తెలంగాణ సీఎం కేసిఆర్ అనలేదట‌. కేవలం వ్యవసాయ అధారిత దళిత కుటుంబాలకు మాత్రమే మూడెకరాల భూమి ఇస్తామని కేసీఆర్ అన్నారట‌. భూముల రేట్లు పెరిగి భూములు దొరకడం లేదు కాబట్టి ఒక్కో కుటుంబానికి రూ.30 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరుతార‌ట‌. ఈ విషయాన్ని తాను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తార‌ట‌. ఇది రాజ‌య్య చేసిన వ్యాఖ్యాలు. కేసీఆర్ ప్ర‌తి బ‌హిరంగ స‌భ‌ల‌ల్లో, మ్యానిఫేస్టోలో కూడా ద‌ళితుల‌కు మూడున్న‌ర ఎక‌రాల భూమిని అందిస్తాన‌ని ప్ర‌క‌టించ‌లేదని రాజ‌య్య చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


అంటే కేసీఆర్ అలాంటి వాగ్దానం ఏనాడు చేయలేదా..?  మ‌రి సీఎం దళితుల‌కు భూపంపిణి చేస్తున్న‌ట్లు అనేకసార్లు ప్ర‌క‌టించారు. మ‌రి ఇది ఏ ప‌థ‌కం కింద‌కు వ‌స్తుంది రాజ‌య్య. తాను పుట్టిన కులం వారికి భూములు కేసీఆర్  ఇవ్వ‌న‌న్నాడ‌ని రాజ‌య్య అన‌డం చూస్తుంటే తెలంగాణ‌లో కేసీఆర్‌కు ద‌ళితుల్లో వ్య‌తిరేకత పెరిగే ప‌నికి పూనుకున్న‌ట్లు స్ప‌ష్టం అవుతుంది. అంతే ఎమ్మెల్యే రాజ‌య్య  చాప‌కింద నీరులా ద‌ళితుల్లో కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త పెంచేందుకు ప‌న్నిన ప్లాన్‌ భాగ‌మే ఇదా అన్న డౌట్ వ‌స్తోంది. సో చూద్దాం రాజ‌య్య కామెంట్‌పై ద‌ళితుల నుంచి, ఇటు టీ ఆర్ ఎస్ వ‌ర్గాల నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: