పోస్టాఫీస్‌లు అన్ని బ్యాంకులతో పోటీపడుతున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫోస్ట్ తాజాగా ఆన్‌లైన్ డిపాజిట్ సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చింది. దీని కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను వినియోగంలోకి తీసుకొని రావడం జరిగింది. దీని సాయంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అకౌంట్, పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌లో ఆన్‌లైన్ ద్వారానే డబ్బులు డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. 


డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ ఆవిష్కరించిన యాప్ పేరు ఇండియా పోస్ట్ మొబైల్ బ్యాంకింగ్ యాప్. దీని సాయంతో అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేయడమే కాకుండా సేవింగ్స్ అకౌంట్‌ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సేవింగ్స్ ఖాతా తెరిచిన తర్వాత పీపీఎఫ్, ఆర్‌డీ, సుకన్య సమృద్ది ఖాతా అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పటికే మీకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే మీరు ఈ యాప్‌ను ఈజీగా వాడుకోవచ్చు. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. అకౌంట్ లేదంటే ఇండియా పోస్ట్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారానే ఓపెన్ చేసుకోవచ్చు.


మొబైల్ యాప్ లో పోస్టాఫీస్ అకౌంట్ ప్రారంభించి, డబ్బులు ఎలా డిపాజిట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా మరి...  మొదటగా ఇండియా పోస్ట్ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. మీరు ఇప్పటికే అకౌంట్ కలిగి ఉండి, ఆన్‌లైన్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకొని ఉంటే.. అప్పుడు అకౌంట్ నెంబర్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ కస్టమర్ ఐడీ, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ సాయంతో మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చు. 


అకౌంట్ లేకపోతే కొత్తగా ఓపెన్ చేసుకోవచ్చు యాప్ లోనే. యాప్ ఓపెన్ చేయగానే ఓపెన్ యువర్ అకౌంట్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ వివరాలు ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మరో ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి. దీని తర్వాత అకౌంట్ ఓపెన్ ఫామ్ కనిపిస్తుంది. ఫామ్‌లో కనిపించే ప్రతి ఒక్క ఆప్షన్‌పై క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత సబ్‌మిట్ చేయాలి. అటుపైన మీ అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడీ జనరేట్ అవుతాయి. ఈ వివరాలు మీకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా రావడం జరుగుతుంది.


ఆ తర్వాత అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడీ, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ సాయంతో యాప్‌లోకి లాగిన్ అవ్వచ్చు. మీరు ఎంపిన్ సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పీపీఎఫ్, ఆర్‌డీ, సుకన్య సమృద్ది ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేయొచ్చు. ఇలా మొబైల్ యాప్ ద్వారా పోస్టాఫీస్ అకౌంట్ వినియోగించుకోవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: