వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలపైనా రాష్ట్రపతి కార్యాలయం తీవ్రంగా స్పందించింది. విచారణ చేయాలని ఏపీ చీఫ్‌ సెక్రటరీని ఆదేశించండం గమనార్హం. తాను క్రిస్టియన్‌ అని.. తన భర్త కాపు కులస్థుడని ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరానికి కొందరు ప్రతినిధులు దృష్టిసారించారు. చట్ట ప్రకారం దళితులు మతం మార్చుకుంటే కులం ద్వారా వచ్చే రిజర్వేషన్‌ హక్కులు కోల్పోతారని ఆమెకు వ్యతిరేకంగా ఆమె ఎన్నిక చెల్లదనే వాదనను తెరమీదకు తెచ్చారు. తాడికొండ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన  కుల ధ్రువీకరణపై కొంతకాలంగా జరుగుతున్న రగడ ఏకంగా రాష్ట్రపతి భవన్‌ దృష్టికి వెళ్ళింది. ఇప్పటికే ఈమె కులంపై కోర్టులో కూడా పిటీషన్‌ దాఖలయ్యాయి. ఇటీవల వినాయక చవితి వేడుకల సందర్భంలో వచ్చిన వివాదం నేపథ్యంలో గతంలో ఆమె ఎలక్ర్టానిక్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి.



తాను ఎస్సీనని ఎన్నికల కమిషన్‌కు డాక్టర్‌ శ్రీదేవి తప్పుడు ధ్రువీకరణను దాఖలు చేసి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఆమె ఎన్నికను రద్దు చేయాలని లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరానికి చెందిన వారు కోర్టును ఆశ్రయించారు. అంతేగాకుండా రాష్ట్రపతికి కూడా ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్రపతి కార్యాలయం స్పందిస్తూ ఎమ్మెల్యే శ్రీదేవి అఫడవిట్‌ దాఖలులో లోపాలపై, ఎస్సీ రిజర్వేషన్‌ దుర్వినియోగంపై వచ్చిన అభియోగాలపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా ఏపీ చీఫ్‌ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. వినాయక చవితి వేడుకల్లో ఒక వినాయక చవితి పందిరి వద్దకు ఎమ్మెల్యే శ్రీదేవి వెళ్ళిన సందర్భంగా ఆ గ్రామంలో చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గ్రామానికి చెందిన ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది.




ఈ ఘటనలో తనను కులం పేరుతో కొందరు దూషించారని ఆరోపిస్తూ ఆమె తుళ్ళూరు పోలీసుస్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు దాఖలు చేశారు. ఈ సంఘటనపై సీఎం జగన్మోహన్‌రెడ్డి కులపరమైన ధూషణలు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని హోంమంత్రిని ఆనాడు ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే సూచించిన కొందరు టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. గతంలో ఆమె ఎలక్ర్టానిక్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ, ఆ సంఘటన సందర్భంగా ఆమె పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా చెల్లవని పలువురు వాదిస్తున్నారు.ఆమె ప్రసార మాంద్యమాల ద్వారా  చేసిన వ్యాఖ్యలను ఆసరగా చేసుకొనే ఆమె లీగల్‌ రైట్స్‌ ప్రొటక్షన్‌ ఫోరం శ్రీదేవి ఎన్నిక చెల్లదనే రగడ చేస్తున్నది. ఏకంగా రాష్ట్రపతి భవన్‌ వర్గాలు జోక్యం చేసుకోవటంతో ఈ వివాదం చివరికి ఏ కొలిక్కి చేరుతుందో కాలమే నిర్ణయించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: