రాష్ట్రంలో ఇసుక కొరతపై ఒక రోజు దీక్ష చేపట్టారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చి లోకేశ్ కు సంఘీభావం పలికారు. రాష్ట్రంలో ఇసుక విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతూండటంతో వారికి సంఘీభావంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ దీక్ష చేపట్టినట్టు ఆయన అన్నారు. దీనిపై  వైసీపీ నాయకులు కూడా అదేవిధంగా స్పందించారు. లోకేశ్ చేసిన దీక్ష డైటింగ్ దీక్ష అని ఎద్దేవా చేశారు.

 


దీనిపై వైసీపీ నాయకుడు, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు గతంలో కూడా ఇలాంటి దీక్షలే చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఎంపీలు దీక్ష చేయాలని అనుకోవటం.. అప్పటి టీడీపీ ఎంపీ మురళీ మోహన్ డైటింగ్ కోసం దీక్ష కొన్ని రోజులు చేయగలను అనటం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని ఉదహరించే శ్రీకాంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ కు ఏం చేయాలో తెలీక డైటింగ్ కోసం ఇలా దీక్షలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. కార్మికులెవరూ టీడీపీ నాయకుల మాట వినొద్దని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు ఒళ్లు తగ్గించుకోవడానికే ఢిల్లీలో దీక్షలు చేశారు.. ఇప్పుడు తనయుడు కూడా అదే ఫాలో అవుతున్నాడని అన్నారు.

 


లోకేశ్ దీక్షకై వైసీపీ సైటైర్లు పేలుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా లోకేశ్ దీక్షపై మెమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. చినబాబు ఒళ్లు తగ్గించుకోవడానికి ఈ దారి దొరికిందా.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే ఇసుక గురించి వైసీపీ నాయకులు, టీడీపీ నాయకుల మధ్య భారీ స్థాయిలో జరుగుతున్న వార్ తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ నాయకుల ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: