2014 నుంచి మొన్న ఎన్నికల ముందు వరకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉప్పు-నిప్పుగా ఉన్న విషయం తెలిసిందే. అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్- ఏపీ సీఎం చంద్రబాబులు పాము-ముంగిసలు లెక్క పోట్లాడుకునే వారు. అందుకే విభజన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. అయితే రెండో సారి తెలంగాణలో కేసీఆర్ సీఎం అయ్యారు. ఇటు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో జగన్...కేసీఆర్ తో సన్నిహితంగా ఉండాలని అనుకున్నారు. 


అందుకు తగ్గట్టుగానే పలుసార్లు జగన్...కేసీఆర్ తో భేటీ అయ్యి విభజన సమస్యలపై సామరస్యంగా చర్చించారు కూడా. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ...ఎప్పుడైతే కేసీఆర్ ఆర్టీసీ విలీనంపై మాట్లాడారో అప్పటి నుంచి జగన్ తో గ్యాప్ వచ్చేలా చేశారు. జగన్ ఓ వైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుని దాని మీద కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో కూడా ఆర్టీసీని విలీనం చేయాలని కార్మికులు సమ్మె చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యమయ్యే పని కాదని, జగన్ కూడా చేయలేడని, కమిటీలు వేసిన అవి ఆరు నెలల్లో కుదరదని చెప్పేస్తాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పుడైతే  ఇలా మాట్లాడారో అప్పటి నుంచి జగన్ విలీన ప్రక్రియని మరింత వేగవంతం చేశారు. తాజాగా కూడా ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని కూడా కేసీఆర్ వ్యాఖ్యలు తమలో కసి పెంచాయని, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆరు నెలల్లో ఆర్టీసీని విలీనం చేసి తీరుతామని మాట్లాడారు. 


ఇదిలా ఉంటే సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను వినియోగించుకోవాలని ఇరు రాష్ట్ర సీఎంలు డిసైడ్ అయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ విషయంలో కేసీఆర్ కు జగన్ హ్యాండ్ ఇచ్చారు.  తెలంగాణతో సంబంధం లేకుండా గోదావరి - కృష్ణా అనుసంధానానికి జగన్ ఒక ప్రణాళికపైన అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ఇక దీని బట్టి చూస్తుంటే కేసీఆర్ మాటలు వల్ల...సీఎం జగన్ చేతలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్లే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: