ఏ మూగ జీవాలతోనైనా ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు, స్థానికులు ఫిర్యాదు చేస్తే.. వాటిని జనావాసాల నుంచి దూరంగా మాత్రమే వదిలేయాలి. కానీ ప్రస్తుతం అలా చేయకుండా వాటిని హతమారుస్తూ.. నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 200 వీధి కుక్కలను చంపేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.


పలుమార్లు వీధికుక్కలు చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లను సైతం కరుస్తుండటంతో తీవ్ర గాయాలపాలవుతున్నారు.  వీధి కుక్కలను నియంత్రించడంలో అధికారుల నిర్లక్ష్యం ఎక్కువైదంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వీధికుక్కల బెడద తగ్గించేందుకు ఓ గ్రామపంచాయితీ సిబ్బంది చేసిన పని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

గ్రామస్థులు కుక్కల బెడద తగ్గించమని కోరినందుకు.. ఆ గ్రామ పంచాయితీ సిబ్బంది ఆ వీధి కుక్కలను పట్టుకుని ఏకంగా వాటికి విషమిచ్చి చంపేశారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గం కంతేరులో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో కుక్కలు బెడద నుంచి ఉపశమనం కోసం.. ఏకంగా వాటిని హతమార్చారు. ఒకటి కాదు.. రెండు కాదు.. అక్షరాల రెండు వందల వీధి కుక్కలను చంపేశారు.

అది కూడా అలా ఇలా కాదు.. ఒకేసారి విష పదార్థాలు ఉపయోగించి మట్టుబెట్టారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న హెల్ప్ ఫర్ యనిమల్ సొసైటీ సభ్యులు.. కంతేరు గ్రామ కార్యదర్శిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పంచాయితీ కార్యదర్శిపై కేసు నమోదు చేశారు. మూగ జీవాలతో ఇబ్బందులు కల్గుతున్న మాట వాస్తమేనని.. అయితే వాటిని ఇంత క్రూరంగా ఇంజెక్షన్లు ఇచ్చి హతమార్చడం ఏంటని జంతుప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. వాటిని పట్టుకుని వేరే ప్రాంతంలో (జనావాసం లేని) విడిచి పెట్టకుండా వాటిపై రసాయన దాడులు (కెమికల్ ఇంజెక్షన్స్ ఉపయోగించి) చేసి ఈ విధంగా హతమార్చడమేంటంటూ మండిపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: